ఈ ఆదాయం పెరుగుదలకు ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే.. ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి చేపట్టిన ముఖ్యమైన చర్యలు కీలకంగా ఉన్నాయి. అందులో సరి కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తేవడం, డిమాండ్ ఉన్న రైళ్లలో అదనపు కోచ్‌ల జోడించడం, రద్దీ ఉన్న ప్రాంతాలకు రైళ్లను పెంచడం వంటి చర్యలను తీసుకుంది రైల్వే శాఖ.