- Telugu News Photo Gallery So many Side Effects of Burning Incense Sticks, check here is details in Telugu
Incense Stick: అగరు బత్తీలు వెలిగిస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
సాధారణంగా ప్రతీ ఇంట్లో అగరు బత్తీలు అనేవి వెలిగిస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా దేవుడికి పూజ చేసిన సమయంలోనే వెలిగిస్తారు. అగరు బత్తీలు లేకుండా పూజ అస్సలు పూర్తి కాదు. పూజతో సంబంధం లేకపోయినా.. చాలా మంది ప్రతి రోజూ వీటిని వెలిగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో చెడు వాసన పోతుందని.. సువాసన వెదజల్లుతుందని వెలిగిస్తూ ఉంటారు. అగరు బత్తీలు వెలిగించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకుంటుంది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా..
Updated on: Jun 27, 2024 | 6:58 PM

సాధారణంగా ప్రతీ ఇంట్లో అగరు బత్తీలు అనేవి వెలిగిస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా దేవుడికి పూజ చేసిన సమయంలోనే వెలిగిస్తారు. అగరు బత్తీలు లేకుండా పూజ అస్సలు పూర్తి కాదు. పూజతో సంబంధం లేకపోయినా.. చాలా మంది ప్రతి రోజూ వీటిని వెలిగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో చెడు వాసన పోతుందని.. సువాసన వెదజల్లుతుందని వెలిగిస్తూ ఉంటారు.

అగరు బత్తీలు వెలిగించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకుంటుంది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. అగరు బత్తీల వాసన పీల్చడం మంచి దేనా అనే డౌట్ వచ్చిందా? ఈ వాసన పీల్చడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

స్మోకింగ్ చేయడం వల్ల ఎంత నష్టం ఉందో.. ఈ అగరు బత్తీల వాసన పీల్చడం వల్ల కూడా అంతే నష్టం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ పొగ పీల్చడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. దీని వల్ల శ్వాస కోశ సమస్యల ఏర్పడతాయట.

అగరు బత్తీల వాసన పీల్చడం వల్ల తుమ్ములు, దగ్గులు కూడా వస్తూ ఉంటాయి. ఈ వాసనకు పిల్లలు ఉక్కిరి బిక్కిరి అయ్యే ప్రమాదం ఉంది. అగరు బత్తీల నుంచి విడుదలయ్యే కాలుష్య కారకాలు కిడ్నీలను పాడు చేస్తాయి. వీటిల్లో అనేక రసాయనాలు కలిపి ఉపయోగిస్తారు.

అగరు బత్తీలను వెలిగించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు.. వీటిని వెలిగించక పోవడమే మంచిది. ఈ పొగ తగిలిన వెంటనే స్కిన్‌పై దురద వస్తుంది. తలనొప్పి, మతి మరుపు కూడా పెరుగుతాయి.




