- Telugu News Photo Gallery So Many Health Benefits of homemade kajal for Eyes, Check Here is Details in Telugu
Katuka Uses: ఆడవాళ్లు కాటుక పెట్టుకోవడం వల్ల కళ్ల సమ్యలన్నీ మాయం!
కాటుకను ఎప్పుడో పూర్వ కాలం నుంచి కూడా ఉపయోగిస్తూ ఉంటున్నారు. కాటుక పెట్టుకోవడం వల్ల కళ్లు చాలా అందంగా కనిపిస్తాయి. పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఈ కాటుకను పెడుతూ ఉంటారు. ఈ కాటుక పెట్టుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అదెలాగో ఇప్పుడు చూడండి..
Updated on: Jan 31, 2025 | 7:02 PM

కాటుక అంటే అందరికీ తెలిసిందే. ఈ కాటుకనే కాజల్ అని పిలుస్తూ ఉంటారు. కానీ ఇంట్లో తయారు చేసే కాటుక వేరు. బయట మార్కెట్లో లభించే కాటుక కూడా వేరు. వీటిని పూర్తిగా రసాయనాలతో తయారు చేస్తారు. పల్లెటూర్లలో ఎక్కువగా అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వారి దాకా కాటుకని పెట్టుకుంటూ ఉంటారు.

కాటుకని కూడా ఐదో తనంగా గుర్తిస్తారు. అందుకే ఆడవాళ్లు ఖచ్చితంగా కాటుక పెట్టుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. కాటుక పెట్టుకోవడం వల్ల అందం చాలా రెట్టింపు అవుతుంది. కళ్లకు కూడా చాలా మంచిది. ఈ కాటుక పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

తరచూ కంటి సమస్యలతో బాధ పడేవారు కాటుకను ధరించడం చాలా మంచిది. కాటు పెట్టుకోవడం వల్ల కంటిలోని ఎర్రటి చారలు అనేవి తొలగిపోతాయి. కళ్లలో ఎలాంటి దుమ్ము, ధూళి పడకుండా.. శుభ్రంగా ఉంచడంలో సహాయ పడతాయి..

కళ్లను మెరిసేలా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. సూర్య కిరణాల నుంచి కూడా కళ్లను కాపాడతాయి. యూవీ కిరణాలు నేరుగా కళ్ల మీద పడినా ఎలాంటి ప్రభావం పడకుండా కాటుక కాపాడుతుంది.

స్పీచ్ ప్రజెంటేషన్ వంటివి ఇచ్చేవారు కాటుక పెట్టుకోవడం వల్ల.. కళ్లలో నుంచి కూడా భావాలు తెలుస్తాయి. కాటుక పెట్టుకోవడం మంచిది కాదు అంంటారు. కానీ ఇంట్లో తయారు చేసే కాటుక పెట్టుకోవడం వల్ల కళ్లకు చాలా మంచిది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




