- Telugu News Photo Gallery So Many Health Benefits of Buttermilk drinking at Summer, Check here is details in Telugu
Buttermilk in Summer: ఎండాకాలంలో మజ్జిగ తాగితే.. ఎంత మంచిదో మీకు తెలుసా?
వేసవి కాలం మొదలైపోయింది. ఉక్క పోత, ఎండ తీవ్రత కూడా స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు కూడా వీస్తున్నాయి. ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణానికే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగలో ఎన్నో రకాల పోషకాలు దాగి ఉన్నాయి. ఎండాకాలమే కాకుండా ప్రతి రోజూ ఒక గ్లాస్ మజ్జిగి తాగితే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. వేసవిలో మజ్జిగ తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి..
Updated on: Apr 12, 2024 | 5:30 PM

వేసవి కాలం మొదలైపోయింది. ఉక్క పోత, ఎండ తీవ్రత కూడా స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు కూడా వీస్తున్నాయి. ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణానికే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.

మజ్జిగలో ఎన్నో రకాల పోషకాలు దాగి ఉన్నాయి. ఎండాకాలమే కాకుండా ప్రతి రోజూ ఒక గ్లాస్ మజ్జిగి తాగితే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. వేసవిలో మజ్జిగ తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది.

కాల్షియం, విటమిన్లు: పెరుగు, మజ్జిగ రెండూ కాల్షియం మంచి మూలం. అనేక ముఖ్యమైన విటమిన్లు కలిగి ఉన్నాయి. పెరుగులో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ B12, B5, B2 మరియు పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. అయితే మజ్జిగలో విటమిన్ B12, జింక్, రైబోఫ్లేవిన్, ప్రోటీన్లు సాపేక్షంగా అధిక మొత్తంలో ఉంటాయి.

బటర్ మిల్క్‌లో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మాన్ని సాఫ్ట్‌గా, కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. అదే విధంగా సమ్మర్‌లో చాలా మంది ఎదురయ్యే మల బద్ధకం, జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. పొట్ట ఆరోగ్యాన్ని పెంచుతుంది.

కేలరీలు: పెరుగు కంటే మజ్జిగలో కేలరీలు చాలా తక్కువ. 100 గ్రాముల పెరుగులో దాదాపు 98 కేలరీలు, 100 గ్రాముల మజ్జిగలో 40 కేలరీలు ఉంటాయి. అందువల్ల, మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, మజ్జిగ ఉత్తమ ఎంపిక.




