- Telugu News Photo Gallery Throwing away used green tea bags? Do you know how many uses there are? Check here is details
Waste Green Tea Bags: వాడేసిన గ్రీ టీ బ్యాగులు పడేస్తున్నారా.. ఎన్ని ఉపయోగలున్నాయో..
గ్రీన్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటి వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సీజనల్ వ్యాధులే కాకుంగా దీర్ఘకాలిక వ్యాధులు సైతం రాకుండా అడ్డుకుంటుంది. చాలా మంది వెయిట్ లాస్ అయ్యేందుకు గ్రీన్ తాగుతారు. అయితే ఒకసారి యూజ్ చేసిన తర్వాత టీ బ్యాగులను పడేస్తుంటారు. కానీ వీటితో ఎన్నో ఉపయోగాలున్నాయి. మరి వేస్టుగా మిగిలిన గ్రీన్ టీ బ్యాగ్స్‌తో..
Updated on: Jul 22, 2025 | 10:50 AM

గ్రీన్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటి వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సీజనల్ వ్యాధులే కాకుంగా దీర్ఘకాలిక వ్యాధులు సైతం రాకుండా అడ్డుకుంటుంది. చాలా మంది వెయిట్ లాస్ అయ్యేందుకు గ్రీన్ తాగుతారు.

అయితే ఒకసారి యూజ్ చేసిన తర్వాత టీ బ్యాగులను పడేస్తుంటారు. కానీ వీటితో ఎన్నో ఉపయోగాలున్నాయి. మరి వేస్టుగా మిగిలిన గ్రీన్ టీతో ఏమేమి చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ టీ బ్యాగును పారేయకుండా.. బయటకు తీసి ఎండలో ఆరబెట్టండి. ఈ ఎండిన గ్రీన్ టీని అల్మారాలో పెడితే.. చెడు వాసన రాదు. అదే విధంగా మొక్కలకు వేసినా.. వాటికి పోషణ అందుతుంది.

ఫ్రిడ్జ్ నుంచి ఒక్కోసారి దుర్వాసన అనేది వస్తుంది. గ్రీన్ టీ బ్యాగ్‌ను కట్ చేసి ఎండలో ఆరబెట్టాలి. ఎండిన గ్రీన్ టీని ఫ్రిడ్జ్‌లో ఉంచితే దుర్వాసన రాకుండా ఉంటుంది. అంతే కాకుండా ఈ గ్రీన్ టీని పేస్టులా చేసి తలకు పట్టిస్తే.. సాఫ్ట్‌గా, రీఫ్రెష్‌గా ఉంటుంది.

అదే విధంగా చాలా మంది నాన్ స్టిక్ పాన్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అది జిడ్డు పేరుకుపోయి.. అంతపట్టాన వదలదు. గ్రీన్ టీ పౌడర్‌ను ఉపయోగించి.. ఆ జిడ్డును తొలగించవచ్చు. ఇది ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది.




