- Telugu News Photo Gallery Skipping Breakfast: Shocking Effects on Your Teeth and Overall HealthKeywords
Lifestyle: ఏంటీ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా?.. అయితే ఆ సమస్య ఆన్‌దివేలో ఉన్నట్టే!
పొద్దునే బ్రేక్ ఫాస్ట్ చేయడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా.. మనకు శక్తి కావాలన్నా.. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఎంతో ముఖ్యం. అయితే రోజురోజుకూ మారుతున్న జీవన విధానం, బిజీ లైఫ్ కారణంగా చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు. ఈ అలావాటు దీర్ఘకాలంగా కొనసాగినే మనం అనేక ఆనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Updated on: Aug 27, 2025 | 7:45 PM

అలాగే స్ట్రాబెర్రీల్లో మాలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది దంతాలను మెరిపిస్తుంది. వీటిలోని శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు దంతాలపై మరకలకు కారణమైన బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. చిగుళ్లలో వాపు రాకుండా చేస్తాయి.

అవును మనం బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల మన పంటి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని వైద్య నిపుణులు అంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్ దాటవేయడం వల్ల మన శరీర అంతర్గత నిర్మాణం మారుతుంది. ఇది గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది.

విటమిన్ డి లోపం ఉన్నవారు పాలు, పెరుగు అధికంగా తీసుకోవాలి. వాటిలో విటమిన్ డి అధిక మొత్తంలో ఉంటుంది. విటమిన్ డి కోసం చేపలను కూడా తినవచ్చు. పాలకూర, పుట్టగొడుగులను తినడం ద్వారా విటమిన్ డి అధికంగా లభిస్తుంది.

ఈ ఆమ్లత్వం మన కడుపుపైనే కాకుండా దంత ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఆమ్లత్వం నోటిలోని pH ని మారుస్తుంది. ఇది మన నోట్లోని ఎనామిల్ పొర కోతకు దారి తీసుస్తుంది. దీని వల్ల దంత క్షయం, కావిటీస్ వంటి సమస్యలు వస్తాయి.

కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండేందుకు.. బ్రేక్‌ఫాస్ట్‌ను రోజూ తప్పకుండా తినండి. మీ శరీరంలో ఆమ్లతను నివారించడానికి ఉదయం నీరు త్రాగడం ద్వారా మీ డేను స్టార్ట్ చేయండి. ఖాళీ కడుపుతో వేడి టీ, కాఫీ మొదలైనవి తాగడం మానుకోండి. (NOTE: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.)




