- Telugu News Photo Gallery Skin care tips these shower mistakes can be reason for body acne in telugu
Skin Care: స్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. అలా చేస్తే ఈ సమస్యలు తప్పవు..
Shower mistakes: స్నానం చేయడం అనేది మన దినచర్యలో భాగం. కానీ ఈ సమయంలో ప్రజలు తరచుగా కొన్ని తప్పులు చేస్తారు. వీటివల్ల చర్మంపై మొటిమలు కనిపించడానికి, చర్మ సమస్యలు తలెత్తడానికి కారణం అవుతుంది. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Feb 27, 2022 | 12:40 PM

వేడి నీళ్లతో స్నానం చేయడం: చలి కాలంలో అందరూ వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. అయితే.. బాగా వేడి నీళ్లతో స్నానం చేయడం మంచిది కాదని స్కిన్ స్పెషలిస్ట్ చెబుతున్నారు. ఇది చర్మంపై మొటిమలకు దారి తీస్తుంది.

చర్మాన్ని రుద్దడం: స్నానం చేసేటప్పుడు చర్మంపై బాగా రుద్దుతారు. దీనివల్ల చర్మంపై ఉన్న మురికి తొలగిపోతుందని భావిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల మొటిమలే రావడమే కాకుండా చర్మంపై దద్దుర్లు, ఎర్రబారడం వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.

ఎక్కువ సబ్బును అప్లై చేయడం: చాలా మంది స్నానం చేసేటప్పుడు చాలా సేపు సబ్బుతో శరీరంపై అప్లై చేస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సబ్బులో ఉండే రసాయనాలు మొటిమలను మాత్రమే కాకుండా, చర్మాన్ని పొడిగా కూడా చేస్తాయి. ఇలాంటి పరిస్థితిలో సబ్బును పరిమిత పరిమాణంలో మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు.

బాడీ లోషన్: స్నానం చేసిన తర్వాత ముఖం లాగా శరీరాన్ని తేమగా ఉంచడం చాలా ముఖ్యం. స్నానం చేసిన తర్వాత చర్మం పొడిగా మారుతుంది. ఈ సమయంలో అది అలానే ఉండటం మంచిది. కానీ బాడీ లోషన్ అప్లై చేస్తే.. శరీరంపై మొటిమలు మొదలవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నాణ్యత లేని సబ్బుల వినియోగం: కొంత మంది స్నానం కోసం చౌకైన ఉత్పత్తులను కొనుగోలు చేసి వినియోగిస్తారు. ఇది చర్మానికి హానికరం అని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిలో ఉండే రసాయనాలు చర్మ సంరక్షణ విషయంలో అస్సలు మంచివి కావని సూచిస్తున్నారు.

స్నానం చేసేటప్పుడు చాలా మంది ఇలాంటి తప్పులు చేస్తుంటారు. వాటిని గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.




