- Telugu News Photo Gallery Side Effects Of Alcohol: How Does Alcohol Affect Your Skin? Check Out here
Side Effects Of Alcohol: కళ్ల చుట్టు నల్లటి వలయాలు పోవాలంటే ఇలా చేసి చూడండి.. చర్మ సమస్యలు కూడా పరార్!
చాలా మందికి మద్యపానం అలవాటు ఉంటుంది. పార్టీలు, పబ్బాలకు మందు చుక్క లేనిదే పూట గడవదు. కానీ ఆల్కహాల్ శరీరానికి ఎంత హానికరమో ఎవరికీ తెలియదు. అయితే మద్యం వల్ల శరీరమే కాదు చర్మం కూడా తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. ఆల్కహాల్ చర్మంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని చాలా మందికి తెలియదు. మద్యపానం అలవాటున్న వారి చర్మానికి ఎలాంటి హాని కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం. మొదటగా చర్మం లోపలి నుంచి పొడిగా..
Updated on: Jan 02, 2024 | 12:04 PM

చాలా మందికి మద్యపానం అలవాటు ఉంటుంది. పార్టీలు, పబ్బాలకు మందు చుక్క లేనిదే పూట గడవదు. కానీ ఆల్కహాల్ శరీరానికి ఎంత హానికరమో ఎవరికీ తెలియదు. అయితే మద్యం వల్ల శరీరమే కాదు చర్మం కూడా తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. ఆల్కహాల్ చర్మంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని చాలా మందికి తెలియదు.

మద్యపానం అలవాటున్న వారి చర్మానికి ఎలాంటి హాని కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం. మొదటగా చర్మం లోపలి నుంచి పొడిగా మారుతుంది. ఫలితంగా చర్మం పొడిబారుతుంది. చర్మం చాలా పొడిగా మారితే చర్మం పొలుసులుగా ఊడిపోవడం ప్రారంభమవుతుంది.

మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు మద్యపానం మానేయాలి. ఎందుకంటే రెగ్యులర్‌గా మద్యం తాగడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి వెంటనే ఈ అలవాటు మానేయండి. ప్రాసెస్ చేసిన ఆహారాలు తినకూడదు.

ఆల్కహాల్ పొడి చర్మం,ఎగ్జిమాకు దారితీస్తుంది. కొన్నిసార్లు చికిత్స తీసుకున్నా ఈ సమస్యను నయం చేయడానికి వీలుపడదు. అలాగే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి.

అతిగా తాగడం వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు వస్తాయని చాలా మందికి తెలియదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మద్యపానం నల్లటి వలయాల సమస్యను రెట్టింపు చేస్తుంది. అంతేకాకుండా, కళ్ల చుట్టూ ఉన్న ప్రాంతం తరచుగా వాపుకు గురవుతుంది.





























