AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sea Food: ఈ సీజన్ లో సీ ఫుడ్ ని తింటున్నారా.. ఎలా నిల్వ చేయాలి.. ఎన్ని రోజులు నిల్వ చేయాలో తెలుసా..!

నాన్ వెజ్ ప్రియులకు చికెన్, మటన్ లను అమితంగా ఇష్టపడేవారు కొందరు ఉంటే మరికొందరు సీఫుడ్ ని అత్యంత ఇష్టంగా తింటారు. ముఖ్యంగా రొయ్యలు, పీతలు, చేపలు, వంటి డిఫరెంట్ సీఫుడ్ ని ఇష్టంగా తింటారు. రొయ్యలు, పీతలు, చేపలను ఏదొక రూపంలో రకరకాల కూరలను తయారు చేస్తారు. అయితే సీఫుడ్ తినడం ఎంత మంచిదో, తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోక పొతే ప్రమాదాలు కూడా ఉన్నాయి. సీఫుడ్ ని సరిగ్గా శుభ్రం చేయకుండా తింటే పొట్టలో ఇబ్బందులు తలెత్తుతాయి. చాలామంది సీఫుడ్ లేదా ఫుడ్ అలర్జీలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కనుక సీఫుడ్ ని తిని ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అప్పుడు రానున్న పెను ప్రమాదాన్ని నివారించవచ్చు. ఏం చేయాలి? ఈ రోజు తెలుసుకుందాం..

Surya Kala
|

Updated on: Aug 17, 2024 | 9:58 AM

Share
రొయ్యలు, ఓస్టెర్, నత్తలు, పీతలు వంటి సీఫుడ్ ను మార్కెట్ నుండి కొనుగోలు చేసిన తర్వాత ఎక్కువసేపు బయట ఉంచవద్దు. వీలైనంత త్వరగా శుభ్రం చేసి ఫ్రిజ్‌లో ఉంచండి. అందులో చేపలు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టి వండడం వలన ఆహారం బాగుంటుంది. లేకపోతే అవి దెబ్బతినవచ్చు.

1 / 7
ఒకవేళ మార్కెట్ నుండి స్తంభింపచేసిన సీఫుడ్ ( కొనుగోలు చేస్తే) ఖరీదు చేయాలనుకుంటే అది సరిగ్గా నిల్వ చేయబడిందో లేదో తనిఖీ చేయండి. ప్యాక్ చేసిన ఆహారాన్ని కొనుగోలు చేస్తే, దాని గడువు తేదీని తనిఖీ చేయండి. అలా ఉంచిన ఆహారాన్ని తినాలనే ఆలోచన వచ్చినా తయారీ తేదీని ముంచు చుడండి.

2 / 7
మార్కెట్ నుండి సముద్రపు చేపలను కొనుగోలు చేసేటప్పుడు అవి తాజాగా ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. వాసనపై కూడా శ్రద్ధ వహించండి. ఇది అమ్మోనియా వంటి వాసన ఉంటే ఆ చేప తాజాది కాదని అర్థం చేసుకోవాలి. చేపల రంగును చూడండి. ముదురు రంగు, దుర్వాసన ఎక్కువగా కనిపిస్తే ఆ చేపను కొనకపోవడమే మంచిది.

3 / 7
సీఫుడ్, రొయ్యలు లేదా పీతలను చాలా బాగా శుభ్రం చేయాలి. సముద్ర చేపలలో సీసం, కాడ్మియం, నికెల్, ఆర్సెనిక్, రాగి, పాదరసం వంటి భారీ లోహాలు ఉంటాయి. కనుక వాటిని బాగా కడగాలి. లేదంటే అవి శరీరంలోకి ప్రవేశించి గుండెపై ప్రభావం చూపుతాయి.

4 / 7
సీఫుడ్ ను రిఫ్రిజిరేటర్ లో ఉంచినా ఎక్కువ సేపు నిల్వ ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే సీఫుడ్‌ని ఎక్కువసేపు ఫ్రిజ్‌లో ఉంచినా బ్యాక్టీరియా సోకుతుంది. అప్పుడు కడుపు నొప్పి, అతిసారం, వాంతులు లేదా ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. కనుక ఫ్రిజ్‌లో ఉంచిన సీఫుడ్ ను 3-4 రోజులలోపు తినడం మంచిది.

5 / 7
సముద్రపు ఆహారంలో శరీరానికి హాని కలిగించే వివిధ పరాన్నజీవులు ఉంటాయి. కనుక బాగా శుభ్రం చేసి ఎక్కువ వేడి మీద ఉడికించాలి. అప్పుడే అన్ని క్రిములు నశిస్తాయి. పచ్చిగా లేదా తక్కువ ఉడికించి తింటే అది ప్రమాదకరం.

6 / 7
సాల్మొనెల్లా బ్యాక్టీరియా సముద్రపు ఆహారంలో పెరుగుతుంది. కనుక వండిన ఆహారంతో ముడి సముద్రపు ఆహారాన్ని ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుంది. కనుక సీఫుడ్ ని ఈ సీజన్ లో తినే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

7 / 7
Follow Us
ఫ్రిజ్‌లో గుడ్లను నిల్వ చేయడానికి సురక్షితమైన ప్రదేశం ఏదో తెలుసా?

పావు కిలో చికెన్‌తో 5 మందికి సరిపడే అరకిలో కూర చేయోచ్చు

CBSE రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌లో జాప్యం.. జూన్ 1న తెరచుకోని విండో

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? రుతుపవనాల అప్డేట్ ఇదే

దేశ ప్రజలకు ఊరట.. తగ్గనున్న ఈ వస్తువుల ధరలు

అంతర్జాతీయ క్రికెట్‌కు ఐదుగురు తోపు ప్లేయర్లు గుడ్‌బై

ఇంతకీ వైభవ్ చెవిలో విరాట్ ఏం చెప్పాడు ?
ఇంతకీ వైభవ్ చెవిలో విరాట్ ఏం చెప్పాడు ?
ఈ కోళ్ళ గుడ్లు, మాంసంతో డబుల్ ఆదాయం.. పెంచితే డబ్బే డబ్బు..

తెలంగాణ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం మళ్లీ బ్యాన్..! కారణం ఇదే

కొత్త ఏసీ కొంటున్నారా..? ఈ విషయం తెలుసుకోకపోతే నష్టపోతారు