Bats Hanging Upside Down: గబ్బిలాలు తలక్రిందులుగా ఎందుకు వేలాడతాయో తెలుసా.. అసలు సంగతి ఇదే..
గబ్బిలాలు ఎప్పుడు చూసినా అవి తలకిందులుగా పడుకోవడం కనిపిస్తుంది.. అంటే తల దించుకుని దేన్నైనా గోళ్లకు పట్టుకుని నిద్రపోతూ ఉంటాయి. అయితే ఇలా ఎందుకు..
Updated on: Mar 25, 2022 | 10:10 PM

గబ్బిలాలు తలక్రిందులుగా ఎందుకు వేలాడతాయని ఎప్పుడైనా ఆలోచించారా? మనం కాసేపు తలకిందులుగా ఉండలేము.. అలాంటిది గబ్బిలాలు జీవిత కాలం తలక్రిందులుగా వేలాడుతాయి. మరి అవి తలక్రిందులుగా వేలాడదీయడంలో ఎందుకు ఇబ్బంది పడటం లేదు..

ప్రపంచవ్యాప్తంగా కనిపించే చాలా రకాల గబ్బిలాలు గోధుమ లేదా నలుపు రంగులో ఉంటాయి. వీటి 'కండరాలు రివర్స్‌లో పనిచేస్తాయి'.

ఒక వ్యక్తి తలక్రిందులుగా వేలాడదీసినప్పుడు.. అతని తలలో రక్తం ప్రవహించడం ఆగిపోతుంది. దీనివల్ల ప్రతి ఒక్కరూ కొంతకాలం తలక్రిందులుగా వేలాడదీయడానికి ఇబ్బంది పడతారు. కానీ, గబ్బిలాలతో, దాని పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వాటిలో రక్తం కూడా చాలా తక్కువగా ఉంటుంది.

ఈ కారణంగా వాటి గుండె తలక్రిందులుగా ఉన్నప్పుడు కూడా రక్త ప్రసరణను నిర్వహించేందుకు సహాయపడుతుంది. అమెరికన్ రెడ్‌క్రాస్ ప్రకారం.. మనం మానవ శరీరం గురించి మాట్లాడినట్లయితే.. మానవునికి 2 గ్యాలన్లు లేదా 7.5 లీటర్ల రక్తం ఉంటుంది.

నేషనల్ జియోగ్రాఫిక్ నివేదిక ప్రకారం.. గబ్బిలాలు చాలా తేలికగా ఉంటాయి. కాబట్టి అవి గురుత్వాకర్షణ, రక్త ప్రసరణ వల్ల పెద్దగా బాధపడవు. దీని కారణంగా గబ్బిలాలు తమను తాము తలక్రిందులుగా వేలాడగలవు. వాటి ప్రత్యేక నిద్ర కారణంగా అవి బాగా ఎగురుతాయి. గబ్బిలం తలకిందులుగా వేలాడుతూ చనిపోయిన తర్వాత కూడా అది తలక్రిందులుగా ఉంటుంది.




