- Telugu News Photo Gallery Say goodbye to all your hair problems with rice water, check here is details in Telugu
Rice Water for Hair: గంజి నీటితో మీ జుట్టు సమస్యలన్నింటికీ బైబై చెప్పేయండి..
జుట్టు అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడున్న కాలంలో జుట్టు రాలిపోవడం, చుండ్రు, నిర్జీవంగా ఉండటం, తేమను కోల్పోయి అందవిహీనంగా కనిపిస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు అనేక రకాల ప్రోడెక్ట్స్‌ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే జుట్టును కాపాడేందుకు నేచురల్ టిప్ప్ కూడా చాలా ఉన్నాయి. వాటిల్లో గంజి వాటర్ కూడా ఒకటి. గంజి వాటర్ గురించి అందరికీ తెలుసు. గంజి వాటర్‌ను జుట్టుకు పట్టించడం వల్ల..
Updated on: Apr 04, 2024 | 1:57 PM

జుట్టు అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడున్న కాలంలో జుట్టు రాలిపోవడం, చుండ్రు, నిర్జీవంగా ఉండటం, తేమను కోల్పోయి అందవిహీనంగా కనిపిస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు అనేక రకాల ప్రోడెక్ట్స్‌ని ఉపయోగిస్తూ ఉంటారు.

అయితే జుట్టును కాపాడేందుకు నేచురల్ టిప్ప్ కూడా చాలా ఉన్నాయి. వాటిల్లో గంజి వాటర్ కూడా ఒకటి. గంజి వాటర్ గురించి అందరికీ తెలుసు. గంజి వాటర్‌ను జుట్టుకు పట్టించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

గంజి నీటిలో ఇనోసిటాల్ అనేది ఉంటుంది. ఇది జుట్టు బలంగా ఉండేలా చేస్తుంది. కుదుళ్లు గట్టి పడి.. రాలిపోకుండా ఉండేలా చేస్తుంది. గంజి నీటిని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు కూడా పెరుగుతుంది.

గంజి నీరు వాడటం వల్ల చుండ్రు కూడా తగ్గుతుంది. అంతే కాకుండా వెంట్రుకలు నెరసి పోవడాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు కూడా గంజి నీటిని ఉపయోగించవచ్చు.

గంజి నీటిని వాడటం వల్ల జుట్టు మెత్తని పట్టుకుచ్చులా తయారవుతుంది. అలాగే మెరిసేలా కూడా చేస్తుంది. కేవలం జుట్టుకు మాత్రమే కాకుండా.. ముఖానికి అప్లై చేసినా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.




