- Telugu News Photo Gallery Relationship Tips: do not make these silly mistakes while having physical relationship
Relationship Tips: ఆ సమయంలో చేయకూడని తప్పులు.. చేశారంటే మీ దాంపత్య జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్నట్లే..!
Relationship Tips: వైవాహిక జీవితంలో కొన్ని విషయాలు ఎప్పటికీ మరిచిపోలేని తగాదాలకు దారితీస్తాయి. అందుకే.. భార్యాభర్తలిద్దరూ కూడా ఎప్పుడూ కలిసి అన్యోన్యంగా ఉండేందుకు ప్రయత్నించాలి. బంధం దృఢంగా ఉండాలంటే... ఇద్దరూ ప్రేమ, ఆప్యాయత, నమ్మకంతో నిండి ఉండాలి. అయితే కొన్ని రకాల తప్పులను ఎప్పటికీ చేయకూడదు.
Updated on: Jun 11, 2023 | 1:32 PM

ఫిజికల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు చేసిన కొన్ని తప్పుల వల్ల ఇద్దరి మూడ్ ఆఫ్ అవుతుంది. ఆ సమయంలో మీ భాగస్వామితో మాట్లాడటం చాలా ముఖ్యం, అయితే ఈ సమయంలో తగని లేదా అనుచితమైన కొన్ని విషయాలను మాట్లాడనేకూడదు. ఆ విషయాలు మీ సంబంధాన్ని నాశనం చేస్తాయి. ఇంకా ఒకరికి ఒకరు దగ్గరయ్యే సమయంలో అ విషయాలను సంభాషించి, తప్పులు చేస్తే జీవితంలో ఎన్నటికీ వాటి నుంచి బయట పడలేరు. మరి ఆ తప్పులేమిటో ఇప్పుడు చూద్దాం..

అనవసర విషయాలు: ఆర్థిక సమస్యలు, కుటుంబ విషయాలు, పని ఒత్తిడి వంటి తీవ్రమైన లేదా అత్యవసరం కాని విషయాలను చర్చించడానికి ఇది సాధారణంగా సరైన సమయం కాదని గుర్తుంచుకోండి. ఈ చర్చలు చిరాకు.. మూడ్.. మేకింగ్. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మీ దాంపత్య జీవితానికి ఎంతో మంచింది.

విమర్శ లేదా ప్రతికూల అభిప్రాయం: లైంగికంగా ఒక్కటయ్యే సమయంలో మీ భాగస్వామితో సరదాగా సంభాషణలు చేయడం, ఇష్టాయిష్టాలను పంచుకోవడం మంచిది. కానీ ఆ సమయంలో విమర్శించడం లేదా తనకు ప్రతికూల అభిప్రాయాన్ని ఇవ్వడం మీ భాగస్వామి ఆత్మగౌరవానికి భంగంగా మారుతుంది. అది మీ వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలను తీసుకురాగలదు.

పాత సంబంధాలు లేదా లైంగిక అనుభవాలు: పాత సంబంధాలు లేదా లైంగిక అనుభవాలను మీ భాగస్వామితో ఏకాంతంగా ఉన్నప్పుడు తీసుకురావడం మీ భాగస్వామికి అసౌకర్యంగా లేదా అసురక్షితంగా అనిపించవచ్చు. మీ భాగస్వామితో మీ ప్రస్తుత జీవితంపై దృష్టి పెట్టడం ముఖ్యం.. అలాంటి విషయాల్లో మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకండి.

భవిష్యత్ ప్రణాళికలు లేదా బాధ్యతలు: భవిష్యత్తు కోసం ప్రణాళిక వేయడం ముఖ్యం.. కానీ శృంగార సమయంలో భవిష్యత్తు ప్రణాళికలు లేదా బాధ్యతల గురించి చర్చించడం దృష్టి మరల్చవచ్చు. ఇది ఇద్దరికీ మూడ్ ఆఫ్ చేస్తుంది.





























