- Telugu News Photo Gallery Punjab National Bank raises benchmark lending rate by 0.15per cent EMIs to go up
PNB: కస్టమర్లకు షాకిచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంకు.. పెరగనున్న EMIల మొత్తం.!
PNB: ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లను పెంచేస్తున్నాయి బ్యాంకులు. వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలకు సంబంధించి ..
Updated on: Jun 01, 2022 | 4:14 PM

PNB: ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లను పెంచేస్తున్నాయి బ్యాంకులు. వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలకు సంబంధించి వడ్డీరేట్లను పెంచేస్తున్నాయి.

ఇక ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) ఎంసీఎల్‌ఆర్ (MCLR)ను అన్ని కాలావధి రుణాలకు 15 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో నెలవారీ వాయిదా (EMI)ల మొత్తం పెరగనుంది.

పెంచిన రేట్లు జూన్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును మే నెలలో 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.40 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే. దీంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణ రేట్లను సవరించింది.

ఏడాది కాల వ్యవధి ఉన్న రుణ రేట్ల ఇకపై 7.25-7.40 శాతం మధ్య ఉండనున్నాయి. మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్ 7.70 శాతానికి చేరింది. ఇలా అన్ని బ్యాంకులు ఇదే బాట పడుతున్నాయి. రుణాలపై వడ్డీ రేట్లను పెంచేస్తున్నాయి.




