మోతీ డుంగ్రి గణేశ్ ఆలయం: గణేశుడు కొలువై ఉన్న మరో ఆలయం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉంది. జైపూర్‌లోని మోతీ డుంగ్రి గణేశ్ ఆలయం 250 సంవత్సరాల క్రితం నిర్మించారు. 1761 లో నిర్మించినట్లు చెబుతారు. కోటలు, కొండల మధ్య నిర్మించబడిన ఈ ఆలయం జైపూర్‌లోని పురాతన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయంలో శివరాత్రి నాడు భక్తులు శివలింగాన్ని పూజిస్తారు. ఇది జైపూర్ సిటీకి 6 కి.మీటర్ల దూరంలో ఉంది. మోతీ డుంగ్రీ దేవాలయం దేశంలోనే అత్యంత అందమైన, పురాతనమైన గణేశ దేవాలయం. ఇక్కడ గణపతి తన భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడని బలంగా నమ్ముతారు.