- Telugu News Photo Gallery Political photos Tirupati mp by election tirupati bypoll tdp candidate panabaka lakshmi election campaign in innovative concepts
Tirupati MP by election : కొబ్బరి బొండాలమ్మకం.. సైకిల్ తొక్కుడు, పనబాక ప్రచార పరంపరలో పదనిసలు
Panabaka Lakshmi Tirupati MP by election campaign : తిరుపతి ఉప ఎన్నికల హడావుడి మామూలుగా లేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడుతున్న తిప్పలు అంతాఇంతా కాదు.
Updated on: Apr 06, 2021 | 7:31 PM

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం పీక్ స్టేజ్ కు చేరింది. మూడు పార్టీల ప్రధాన అభ్యర్థులు కాళ్లకు చక్రాలు కట్టుకుని ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో సీనియర్ అయిన పనబాక లక్ష్మి తనదైన స్టైల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ప్రచారంలో దూసుకుపోతున్నారు. వింత వింత అవతారాలు ఎత్తుతూ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ఆమె. వినూత్న ప్రయత్నాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పాటుపడుతున్నారు.

తిరుపతి పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిని అయిన పనబాక లక్ష్మి ఇవాళ వినూత్నరీతిలో ప్రచారం చేశారు. అందరితోపాటు సైకిల్ తొక్కి ఆకట్టుకున్నారు. ఆ పక్కనే రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి బోండాలు అమ్మే టైరుబండి వద్దకెళ్లి మహిళలు, పురుషులతో మాటా మాటకలిపారు. కుశల ప్రశ్నలు అడిగారు. కత్తితో కొబ్బరి బోండాన్ని కొట్టారు.

ఇలా పనబాక లక్ష్మి అందరితో కలసిపోతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నాలుగుసార్లు ఎంపీగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన పనబాక లక్ష్మి ప్రచారంలో తనదైన శైలి చూపిస్తున్నారు. తడ మండలం అక్కంపేట వద్ద ఈ వినూత్న దృశ్యాలు కనిపించాయి.