Balaraju Goud |
Updated on: Feb 03, 2022 | 9:46 PM
వందలాది ప్రముఖులు.. వేలాది ఋత్వికులు.. లక్షలాది భక్తులతో శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం కన్నుల పండువగా జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సతీసమేతంగా స్ఫూర్తి కేంద్రానికి వచ్చారు.
తొలుత భారీ శ్రీరామానుజ విగ్రహ ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడి పనులను సమీక్షించారు. ముఖ్యమంత్రికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, మై హోమ్ గ్రూప్స్ అధినేత డా.జూపల్లి రామేశ్వరరావు ఏర్పాట్లను వివరించారు.
సమతా స్ఫూర్తి విగ్రహం నుంచి కాలినడకన సెక్యూరిటీ సెంటర్‌కు చేరుకున్నారు సీఎం కేసీఆర్. ఈ నెల 5న ప్రధాని నరేంద్రమోదీ ముచ్చింతల్ వస్తున్నారు. ఆ ఏర్పాట్లను పర్యవేక్షించారు CM కేసీఆర్. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో భద్రత ఏర్పాట్లు సమీక్ష చేశారు.
సెక్యూరిటీ రివ్యూ తర్వాత ప్రధాన యాగశాలను సందర్శించింది KCR కుటుంబం. యాగశాలకు నమస్కరించి పరిక్రమణ చేశారు సీఎం దంపతులు. యాగశాల ప్రాంగణంమొత్తం తిరిగి పరిశీలించారు. పెరుమాళ్లను దర్శించుకున్నారు. సహస్రాబ్ది వేడుకలు జరుగుతున్నతీరు.. ఏర్పాట్లును అడిగి తెలుసుకున్నారు.
సహస్రాబ్ది వేడుకలు జరుగుతున్నతీరు.. ఏర్పాట్లును cm అడిగి తెలుసుకున్నారు.
శ్రీ మద్రామానుజ విగ్రహం... సమానత్వానికి ప్రతీక అన్నారు CM కేసీఆర్. దేవుని ముందు ప్రజలందరూ సమానమే అన్న రామానుజ స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఇలాంటి శాంతి సందేశం జాతికి, దేశానికి అవసరమన్నారు.
రేపు యాగశాలలో శ్రీలక్ష్మీనారాయణేష్టి, సత్సంతానానికై వైనేతేయేష్టి, శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజ జరుగనున్నాయి. ఇక ఫిబ్రవరి 5న భారత ప్రధాని నరేంద్రమోదీ 216 అడుగుల సమతామూర్తి భగవద్రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం ఇవ్వనున్నారు.