- Telugu News Photo Gallery Political photos PM Modi meditates at Vivekananda memorial in Kanniyakumari see photos
PM Modi: వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని మోదీ 45 గంటల ‘మహా ధ్యానం’ ప్రారంభం
కన్యాకుమారిలోని వివేకానంద మెమోరియల్‌లో ప్రధాని మోదీ ధ్యానం కొనసాగుతోంది. నిన్న సాయంత్రం మొదలైన ధ్యానం రేపు మధ్యాహ్నం వరకు కొనసాగనుంది.
Updated on: May 31, 2024 | 11:45 AM

తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ 45 గంటల ధ్యానం ప్రారంభమైంది. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని స్వామి వివేకానంద కలలుగన్న ప్రదేశంలో ప్రధాని మోదీ ధ్యానం చేస్తున్నారు. ప్రధానమంత్రి ధ్యాన సాధన జూన్ 1 వరకు కొనసాగుతుంది

కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం చేస్తున్నారు. ప్రధాని మోదీ ధ్యానం చేస్తున్నట్టుగా కొన్ని చిత్రాలు బయటకు వచ్చాయి. ఇందులో అతను సూర్య భగవానుడికి నీరు సమర్పించి సూర్య నమస్కారం చేశారు.

కన్యాకుమారి చేరుకున్న ప్రధాని భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేశారు. తర్వాత ఫెర్రీలో వివేకానందుడి విగ్రహం వద్దకు చేరుకున్నారు. ధ్యాన మండపంలో అయన వివేకానంద,రామకృష్ణ పరమహంస ముందు చేతులు జోడించారు. అనంతరం ప్రధాని మోదీ ధ్యానంలో కూర్చున్నారు.

ఈ చిత్రాలలో ప్రధాని మోదీ కాషాయ వస్త్రాలు ధరించి కనిపించారు. అతని చేతుల్లో రుద్రాక్ష జపమాల కూడా కనిపిస్తుంది. 45 గంటల పాటు మోదీ ధ్యానంలో ఉంటారు.

ప్రధాని మోదీ 45 గంటల పాటు లిక్విడ్ డైట్ మాత్రమే తీసుకుంటారు. ఈ సమయంలో కొబ్బరి నీరు, ద్రాక్ష రసం మాత్రమే తీసుకుంటారు. ప్రస్తుతం ప్రధానమంత్రి మౌన నిరాహార దీక్ష చేస్తారు.

2019 లోక్‌సభ ఎన్నికల చివరి దశకు ముందు కూడా ప్రధాని మోదీ ధ్యానంలో పాల్గొన్నారు. 2014లో కేదార్‌నాథ్, శివాజీ ప్రతాప్‌గఢ్‌లను సందర్శించారు.

1892లో స్వామి వివేకానంద ఎక్కడైతే మూడు రోజులపాటు ధ్యానం చేశారో అదే ప్రాంతంలో ఈ రాక్ మెమోరియల్‌ను నిర్మించారు. ఇప్పుడు ప్రధాని మోదీ అక్కడే వివేకానంద విగ్రహం ముందు ధాన్యానికి కూర్చున్నారు. రేపటి వరకూ ఆయన మెడిటేషన్‌లోనే ఉంటారు. నిన్న సాయంత్రం 6.45కి ఈ ధ్యానం మొదలైంది.

ధ్యానం కోసం వివేకానంద రాక్ మెమోరియల్‌కు వెళ్లే ముందు ప్రధాని మోదీ పూజలు చేశారు. భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.




