- Telugu News Photo Gallery Political photos Janasenani pawan kalyan visited satya devadi Temple in annavaram Telugu Political Photos
Pawan Kalyan at Annavaram: వారహితో అన్నవరంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు.. ఫొటోస్.
పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు అడ్డంకులు తొలగిపోయాయ్. అన్నవరం టు భీమవరం ప్రయాణం నేడే ప్రారంభం కాబోతోంది.అన్నవరం సత్యదేవుని ఆశీస్సులు తీసుకొని వారాహి యాత్రను మొదలుపెట్టబోతున్నారు జనసేన అధినేత.
Updated on: Jun 14, 2023 | 12:49 PM

పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు అడ్డంకులు తొలగిపోయాయ్. అన్నవరం టు భీమవరం ప్రయాణం నేడే ప్రారంభం కాబోతోంది.

అన్నవరం సత్యదేవుని ఆశీస్సులు తీసుకొని వారాహి యాత్రను మొదలుపెట్టబోతున్నారు జనసేన అధినేత.

అన్నవరం సత్యదేవుని సన్నిధి నుంచి మొదలై, భీమవరం వరకు సాగనుంది తొలి విడత యాత్ర.

ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, నరసాపురం నియోజకవర్గాల మీదుగా పవన్ టూర్ సాగనుంది.

యాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 21న అమలాపురంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది జనసేన.

మంగళగిరి జనసేన ఆఫీస్‌లో వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, వాహనాన్ని సంసిద్ధం చేశారు.

వారాహితోపాటు జనసేన అధినేత కూడా నిన్న రాత్రికే అన్నవరం చేరుకున్నారు.

ఈరోజు సత్యదేవుని సన్నిధానంలో పూజలు నిర్వహించి, యాత్రను ప్రారంభిస్తారు పవన్ కల్యాణ్.





























