- Telugu News Photo Gallery Political photos CM KCR performs special pooja for nomination papers in Siddipet Venkateshwara Swamy Temple photos
BRS Party: కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్.. నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు
ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు సీఎం కేసీఆర్, ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావుతోపాటూ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తన నామినేషన్ పత్రాలను స్వామి వారి పాదాల ముందు ఉంచి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడి ప్రాంతం మొతం గులాబీ మయమైంది. ఈ నెల 9న మంచి ముహూర్తం ఉండటంతో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్ వేసేందుకు సీఎం కేసీఆర్ సిద్దమైనట్లు అధికారికంగా అందుతున్న సమాచారం.
Srikar T |
Updated on: Nov 04, 2023 | 2:36 PM

తెలంగాణ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఒకవైపు పార్టీలు అభ్యర్థులను ప్రకటించేందుకు తలమునకలైయ్యారు. మరో వైపు అధికార బీఆర్ఎస్ తన అభ్యర్థులను నెల క్రితమే ప్రకటించింది. ఈ నెల 3వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవడంతో నాయకుల మొదలు కార్యకర్తల వరకూ కొత్త జోష్ కనిపిస్తోంది.

ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు సీఎం కేసీఆర్, ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావుతోపాటూ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇప్పటికే చాలా బహిరంగ సభలను పూర్తి చేసుకుని ప్రచారంలో ముందంజలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఈ నెల 30న జరిగే ఎన్నికలకు ప్రత్యేకంగా మ్యనిఫెస్టోను రూపొందించి ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించింది.

ఈ నెల 9న మంచి ముహూర్తం ఉండటంతో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్ వేసేందుకు సీఎం కేసీఆర్ సిద్దమైనట్లు అధికారికంగా అందుతున్న సమాచారం. నామినేషన్ ప్రక్రియకు కూడా అదే చివరి రోజు కావడం గమనార్హం. మంత్రి హరీష్ రావు కూడా అదే రోజు సిద్దిపేటలో నామినేషన్ వేయనున్నారు.

తన నామినేషన్ పత్రాలను స్వామి వారి పాదాల ముందు ఉంచి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడి ప్రాంతం మొతం గులాబీ మయమైంది.





























