Assembly Elections 2022: ఉత్తరప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రముఖుల ప్రత్యేక చిత్రాలు
ఉత్తరప్రదేశ్ మూడో దశ, పంజాబ్ ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు, పంజాబ్‌లో 117 స్థానాలకు పోలింగ్ జరుగింది.
Votes
Follow us
Akhilesh Yadav
పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ మొహాలీలోని పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు.
పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఆయన భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పంజాబ్ లోక్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పాటియాలాలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంజాబ్ నుంచి కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు.
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఎస్పీ పోషకుడు ములాయం సింగ్ యాదవ్ సైఫాయ్‌లోని జస్వంత్‌నగర్ పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు.
శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్, ప్రకాష్ సింగ్ బాదల్, హర్సిమ్రత్ కౌర్ బాదల్ ముక్త్సర్లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ పంజాబ్‌లో అకాలీదళ్ బీఎస్పీ కూటమి 80 సీట్లకు పైగా గెలుస్తుందని ప్రకటించారు.