Periods in Winter: అందుకే ఆ సమయంలో భరించలేని నొప్పి వెంటాడుతుంది.. ఇలా చేశారంటే ఉపశనం పొందొచ్చు
చలికాలంలో పీరియడ్స్ మరింత ఇబ్బందిని పెడతాయి. ఈ కాలంలో పదేపదే బాత్రూమ్‌కు వెళ్లడం అసౌకర్యంగా అనిపిస్తుంది. పొత్తికడుపులో నొప్పి ప్రారంభమైతే, నడుము, కాళ్ళలోకి నొప్పి ప్రవేశిస్తుంది. అప్పుడు చికాకు పెరుగుతుంది. చలికాలంలో నెలసరి నొప్పి పెరగడానికి కారణం.. ఈ కాలంలో రక్తనాళాలు కుచించుకుపోతాయి. దీని కారణంగా రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. అందువల్లనే ఋతుస్రావం సమయంలో పొత్తికడుపు నొప్పి పెరుగుతుంది.చలికాలంలో మహిళల శరీరంలో విటమిన్ డి లేకపోవడం కూడా ప్రీ-మెన్‌స్ట్రువల్ లక్షణాలు..
Updated on: Dec 17, 2023 | 7:51 PM

చలికాలంలో పీరియడ్స్ మరింత ఇబ్బందిని పెడతాయి. ఈ కాలంలో పదేపదే బాత్రూమ్‌కు వెళ్లడం అసౌకర్యంగా అనిపిస్తుంది. పొత్తికడుపులో నొప్పి ప్రారంభమైతే, నడుము, కాళ్ళలోకి నొప్పి ప్రవేశిస్తుంది. అప్పుడు చికాకు పెరుగుతుంది.

చలికాలంలో నెలసరి నొప్పి పెరగడానికి కారణం.. ఈ కాలంలో రక్తనాళాలు కుచించుకుపోతాయి. దీని కారణంగా రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. అందువల్లనే ఋతుస్రావం సమయంలో పొత్తికడుపు నొప్పి పెరుగుతుంది.చలికాలంలో మహిళల శరీరంలో విటమిన్ డి లేకపోవడం కూడా ప్రీ-మెన్‌స్ట్రువల్ లక్షణాలు పెరగడానికి మరో కారణం. ఈ పోషకం లేకపోవడం వల్ల శరీరంలో చికాకు, అలసట వస్తుంది.

పీరియడ్స్ సమయంలో ఏమి తింటున్నారు, ఏమి తాగుతున్నారు అనే దానిపై శ్రద్ధ పెట్టాలి. ఎక్కువ కూరగాయలు, పండ్లు తినాలి. అలాగే పచ్చి పసుపు ముక్క ఒకటి తినండి. పసుపు దిగువ పొత్తికడుపు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

చలికాలంలో చాలా మంది తక్కువ నీరు తాగుతుంటారు. శరీరంలో నీరు లేకుంటే కండరాల నొప్పి తీవ్రమవుతుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇది శారీరక బలహీనతను కూడా తగ్గిస్తుంది. చలికాలంలో నెలసరి నొప్పుల నుంచి బయటపడేందుకు తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

ఈ సీజన్‌లో శరీరం వెచ్చగా ఉండటం వల్ల రక్తప్రసరణ చురుకుగా సాగుతుంది. వేడి నీళ్లతో స్నానం చేయాలి. అలాగే పీరియడ్స్ సమయంలో చమోమిలే, అల్లం టీ వంటి హెర్బల్ టీలు వేడిగా తాగాలి. వీటిల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.





























