- Telugu News Photo Gallery People with these issues should not eat mushrooms, it is harmful for their health
వీళ్లు పుట్టగొడుగులు తింటే యమ డేంజర్..! ఆస్పత్రిలో బిల్లుకు డబ్బులు రెడీ చేసుకోవాల్సిందే..!!
పుట్టగొడుగులు..మంచి పోషకాలు నిండివున్న అద్భుతమైన ఆహారంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పుట్టగొడుగులను పోషకాల పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఇందులో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, విటమిన్ డి, విటమిన్ బి, సెలీనియం, పొటాషియం అంటే ఖనిజాలు, బీటా గ్లూకాన్స్ తో పాటు మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే అనేక ఇతర సమ్మేళనాలు కూడా ఉంటాయి. కాబట్టి పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల మన శరీరం వ్యాధులు ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుందని చెబుతున్నారు. కానీ, పుట్టగొడుగులు తినటం కొందరికి సరైనది కాదు అని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
Updated on: Feb 19, 2025 | 6:41 PM

పుట్ట గొడుగులను ఇప్పుడు అందరూ తింటున్నారు. వీటిల్లో అనేక రకాలు కూడా ఉన్నాయి. మష్రూమ్స్‌లో ఒక రకం తినడం వల్ల క్యాన్సర్‌ను కంట్రోల్ చేసుకోవచ్చని.. ఇటీవల జరిగిన పలు అధ్యయనాల్లో తేలింది.

అంతే కాదు పుట్టగొడుగులను ఎక్కువగా తీసుకోవడం వల్ల ముక్కు నుంచి రక్తం కారడం, ముక్కు పొడిబారడం, గొంతు పొడిబారడం వంటి సమస్యలు కూడా వస్తాయి. కొందరు తలనొప్పి సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు పుట్టగొడుగుల్ని తినకపోవడమే మేలు. ఇలాంటి వారు పుట్టగొడుగుల్ని ఎక్కువగా తింటే తలనొప్పి సమస్య ఎదుర్కోవాలి.

చాలా మందికి అజీర్తి, ఉబ్బరం, కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు తరుచుగా వస్తూంటాయి. ఇలాంటి వారు పుట్టగొడుగుల్లని ఎక్కువగా తినకపోవడమే బెస్ట్. అందుకే కొంతమందికి పుట్టగొడుగులు తిన్న వెంటనే విరేచనాలు ప్రారంభమవుతాయి. జీర్ణసమస్యలు ఉన్నవారు వీటిని తినకపోవడమే మేలు. ఇది అస్సలు వారికి పడదు.

ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న వాళ్లు అస్సలు పుట్టగొడుగులు తినకూడదని అంటున్నారు. ఇలాంటి వారు పుట్టగొడుగులు తింటే భయం, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు మరింతగా ఎదుర్కొంటారు. గర్బిణీలు లేదా పాలిచ్చే తల్లులు కూడా వీటిని మితంగా మాత్రమే తినాలని చెబుతున్నారు..

అంతేకాదు.. ఇప్పుడు మార్కెట్లో అనేక రకాలు పుట్టగొడుగులు అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో కొన్ని ఆరోగ్యానికి హానికరం. అందుకే వీటిని కొనే ముందు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి మేలు చేసేవి మాత్రమే తీసుకోవాలి. హాని చేసే పుట్టగొడుగుల్ని గుర్తించి వాటిని కొనకపోవడమే ఉత్తమం.




