- Telugu News Photo Gallery People with such problems should not eat garlic at all, check here is details in Telugu
Garlic Disadvantages: ఇలాంటి సమస్యలు ఉన్నవారు వెల్లుల్లికి దూరంగా ఉండాలి..
వంటల్లో వెల్లుల్లి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందరి ఇళ్లల్లో వెల్లుల్లి అనేది కామన్‌గా ఉండే వస్తువు. వెల్లుల్లితో ఉండే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఆయుర్వేదంలో కూడా పలు అనారోగ్య సమస్యల్ని తగ్గించడానికి వెల్లుల్లిని ఔషధంలా ఉపయోగిస్తారు. వెల్లుల్లితో ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు. జీర్ణ క్రియ సమస్యలు, కొలెస్ట్రాల్ తగ్గించడం, క్యాన్సర్ కణాలను నాశనం చేయడం, డయాబెటీస్ కంట్రోల్ చేయడం, కాలేయాన్ని రక్షించడం, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడం ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్..
Updated on: Jan 29, 2024 | 6:42 PM

వంటల్లో వెల్లుల్లి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందరి ఇళ్లల్లో వెల్లుల్లి అనేది కామన్‌గా ఉండే వస్తువు. వెల్లుల్లితో ఉండే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఆయుర్వేదంలో కూడా పలు అనారోగ్య సమస్యల్ని తగ్గించడానికి వెల్లుల్లిని ఔషధంలా ఉపయోగిస్తారు. వెల్లుల్లితో ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు.

జీర్ణ క్రియ సమస్యలు, కొలెస్ట్రాల్ తగ్గించడం, క్యాన్సర్ కణాలను నాశనం చేయడం, డయాబెటీస్ కంట్రోల్ చేయడం, కాలేయాన్ని రక్షించడం, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడం ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.

అయితే వెల్లుల్లి అనేది అందరికీ మేలు చేస్తుందని చెప్పలేం. కొందరు వెల్లుల్లి తినకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు వీలైనంత వరకూ వెల్లుల్లికి దూరంగా ఉండటం మంచిద. లేదంటే అలర్జీ సమస్యలు రావచ్చని చెబుతున్నారు.

హైపటైటిస్ ఉన్నవారు వెల్లుల్లి తినకపోవడమ మంచిది. ఇది తింటే హైపటైటిస్ రోగుల్లో వికారం లక్షణాలు పెరుగుతాయి. రక్త హీనతకు దారి తీస్తుంది. అదే విధంగా డయేరియాతో బాధ పడేవారు సైతం వెల్లుల్లి తినకూడదు.

కంటి సంబంధిత సమస్యలతో బాధ పడేవారు సైతం వెల్లుల్లికి దూరంగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా వెల్లుల్లి తక్కువగా తినాలి. అంతే కాకుండా రక్త పోటు సమస్య ఉన్నవారు, ఎక్కువగా చెమట పట్టేవారు కూడా వెల్లుల్లి తినకపోవడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.




