- Telugu News Photo Gallery Papad Health Benefits: Health benefits of eating papads: A nutritious snacking option
Papad Health Benefits: భోజనంలో అప్పడాలు తినే అలవాటు మీకూ ఉందా? ఈ విషయం తెలుసుకోండి..
పెళ్లిళ్లు, బారసాలలు నుంచి పండగలు పబ్బాల వరకు ఏ శుభకార్యక్రమం తలపెట్టిన ఇంటిళ్లి పాదిని ఇంటికి పిలిచి కడుపారా భోజనం పెట్టడం మన తెలుగింటి సాంప్రదాయం. విందు భోజనం పెట్టే టప్పుడు ఏది ఉన్నా లేకున్న తప్పనిసరిగా వేయించిన అప్పడాలు లేకుంటే ఏదో తెలియని లోటు కనిపిస్తుంది. భోజనం వడ్డించిన విస్తరి కూడా అసంపూర్తిగా అనిపిస్తుంది. అది మాంసాహారమైనా, శాకాహారమైనా విస్తరాకులో ఓ అప్పడం వడ్డించడం..
Updated on: Jul 08, 2024 | 12:46 PM

పెళ్లిళ్లు, బారసాలలు నుంచి పండగలు పబ్బాల వరకు ఏ శుభకార్యక్రమం తలపెట్టిన ఇంటిళ్లి పాదిని ఇంటికి పిలిచి కడుపారా భోజనం పెట్టడం మన తెలుగింటి సాంప్రదాయం. విందు భోజనం పెట్టే టప్పుడు ఏది ఉన్నా లేకున్న తప్పనిసరిగా వేయించిన అప్పడాలు లేకుంటే ఏదో తెలియని లోటు కనిపిస్తుంది. భోజనం వడ్డించిన విస్తరి కూడా అసంపూర్తిగా అనిపిస్తుంది. అది మాంసాహారమైనా, శాకాహారమైనా విస్తరాకులో ఓ అప్పడం వడ్డించడం మన తెలుగోళ్ల ఆచారం.

సాధారణంగా మార్కెట్లో రకరకాల అప్పడాలు అందుబాటులో ఉంటాయి. వీటిల్లో సగ్గు బియ్యం నుండి గసగసాల వరకు వివిధ రకాల అప్పడాలు ఉంటాయి. విభిన్న రుచులలో మాత్రమే కాకుండా, వివిధ ఆకారాలలో కూడా ఇవి ఉంటాయి. సాయంత్రం స్నాక్‌తో టీ లేదంటే అన్నం ఏదైనా సరే రుచికరమైన అప్పడాలు దేనిలోనైనా బలేగా ఉంటాయి. అయితే, ఇవి ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తాయనే విషయంలో ప్రశ్న చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా డైటింగ్ చేసేవారు అప్పడాలు తినాలా వద్దా అనే సదేహం తలెత్తుతుంది.

ప్రముఖ డైటీషియన్ ప్రకారం.. అప్పడాల్లో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ వంటి పోషకాలతోపాటు ఐరన్ కూడా అధికంగా ఉంటుంది. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. అప్పడాలు ఆరోగ్యకరమైనది అయినప్పటికీ, దాని తయారీ నాణ్యతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

అప్పడాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. భోజనంలో వీటిని తింటే, శరీరంలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పెంచుతుంది. అంతేకాకుండా, అప్పడాలు పూర్తిగా గ్లూటెన్-ఫ్రీగా ఉంటాయి. కాబట్టి మీకు అలెర్జీ సమస్య ఉన్నప్పటికీ, అప్పడాలను సురక్షితంగా తినవచ్చు.

అప్పడాల్లో సోడియం అధికంగా ఉంటుంది. కాబట్టి సోడియం తక్కువగా ఉండే ఆహారం తీసుకునే వారు వీటిని తినకూడదు. ఇది శరీరంలో సోడియం స్థాయిని పెంచుతుంది. అయితే, సోడియం స్థాయిలు తక్కువగా లేదా సాధారణంగా ఉంటే, ప్రతిరోజూ అప్పడాలు తినవచ్చు.




