- Telugu News Photo Gallery Oversleeping Bad Effects: Oversleeping Is Associated With Many Health Problems, Know All Bad Effects Here
Oversleeping: రోజుకు 9 గంటలకు మించి నిద్రపోయే అలవాటు మీకూ ఉందా? జాగ్రత్త మరణం మీకు చేరువలో ఉన్నట్లే..
మనలో చాలా మందికి బెడ్ కనిపిస్తే చాలు వాలిపోతుంటారు. రోజంతా బెడ్‌పై అలా నిద్రపోతూనే ఉంటారు. ఇలా రోజుకు 9-10 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే అలవాటు మీకూ ఉందా? కానీ ఇది మీ ఆయుష్షుకు ఏమాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరోరకంగా చెప్పాలంటే మీరు ఓవర్ స్లీపింగ్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. ఒక వ్యక్తి క్రమం తప్పకుండా 10 గంటల కంటే ఎక్కువ నిద్రపోతే, అతను ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు లెక్క..
Updated on: Feb 27, 2024 | 12:23 PM

మనలో చాలా మందికి బెడ్ కనిపిస్తే చాలు వాలిపోతుంటారు. రోజంతా బెడ్‌పై అలా నిద్రపోతూనే ఉంటారు. ఇలా రోజుకు 9-10 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే అలవాటు మీకూ ఉందా? కానీ ఇది మీ ఆయుష్షుకు ఏమాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరోరకంగా చెప్పాలంటే మీరు ఓవర్ స్లీపింగ్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. ఒక వ్యక్తి క్రమం తప్పకుండా 10 గంటల కంటే ఎక్కువ నిద్రపోతే, అతను ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు లెక్క. ఎక్కువ సేపు నిద్రపోయే వారికి ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది.

Sleep

అందువల్ల ఒక నిర్దిష్ట సమయాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి. రోజూ ఉదయాన్నే నిద్ర లేవడం మంచిది. రోజు తర్వాత ఎక్కువ నిద్రపోవడం కూడా మరణానికి కారణమవుతుంది. రోజుకు 7 నుండి 8 గంటలు నిద్రపోయే వ్యక్తి కంటే రోజుకు 9 గంటల కంటే ఎక్కువ నిద్రించే వ్యక్తి త్వరగా చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివిధ అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అయితే దీనికి ఖచ్చితమైన కారణం ఇంకా పరిశోధనల్లో కనుగొనలేదు. ఎక్కువ నిద్ర మానసిక అలసటకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది వ్యక్తిని శారీరకంగా కూడా బలహీనపరుస్తుంది. వీటన్నిటి కారణంగా, ఇటవంటి వారు రోజురోజుకు మరణం వైపుకు చేరువవుతుంటారు.

కొన్నిసార్లు కొన్ని మందుల వల్ల కలిగే దుష్ప్రభావాల వల్ల కూడా విరామం లేకుండా అతిగా నిద్రకు గురవుతారు. వైద్య శాస్త్రం ప్రకారం.. హైపర్సోమ్నియా ఈ సిండ్రోమ్‌కు కారణం అవుతుంది. ఈ లక్షణాలు మీలో కూడా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోండి.




