- Telugu News Photo Gallery Onion Storing Tips: How to Store Onions So They Don't Stink Up Your Fridge
Kitchen Tips: తరిగిన ఉల్లి ముక్కలు ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా? ఈ పొరపాటు అస్సలు చేయకండి..
నేటి కాలంలో ఫ్రిజ్ లేకుండా ఒక్క క్షణం కూడా గడవదు. కూరగాయల నుంచి గుడ్లు, పాలు వరకు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకుంటున్నాం. వండిన ఆహారంతో పాటు కూరగాయలను కట్ చేసి ఫ్రిజ్‌లో దాచుకుంటున్నాం. కూరగాయలను కట్ చేసి గాలి చొరబడని డబ్బాలో లేదా జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచి మరుసటి రోజు వంట చేసుకోవచ్చు. అయితే పచ్చి ఉల్లిపాయలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు..
Updated on: Nov 10, 2023 | 9:06 PM

నేటి కాలంలో ఫ్రిజ్ లేకుండా ఒక్క క్షణం కూడా గడవదు. కూరగాయల నుంచి గుడ్లు, పాలు వరకు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకుంటున్నాం. వండిన ఆహారంతో పాటు కూరగాయలను కట్ చేసి ఫ్రిజ్‌లో దాచుకుంటున్నాం.

కూరగాయలను కట్ చేసి గాలి చొరబడని డబ్బాలో లేదా జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచి మరుసటి రోజు వంట చేసుకోవచ్చు. అయితే పచ్చి ఉల్లిపాయలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు.

పచ్చి ఉల్లిపాయ వాసన ఇతర కూరగాయలను కూడా చెడిపోయేలా చేస్తుంది. ఇందులో సల్ఫర్ ఉంటుంది. అందుకే ఉల్లిపాయలను కోసేటప్పుడు కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తాయి. ఉల్లిపాయలను కోసి ఫ్రిజ్‌లో పెడితే బ్యాక్టీరియా పెరుగుతుంది.

ఉల్లిపాయలను ఓపెన్ కంటైనర్‌లో లేదా రిఫ్రిజిరేటర్‌లో ఎప్పుడూ నిల్వ చేయకూడదు. ఉల్లిపాయ ముక్కలను ఫ్రిజ్‌లో ఎక్కువసేపు ఉంచడం వల్ల దాని పోషక విలువలు పూర్తిగా నశిస్తాయి. అంతేకాకుండా, ఇలాంటి ఉల్లిపాయ తినడం వల్ల ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది.

రిఫ్రిజిరేటర్లో ఉల్లిపాయలను నిల్వ చేయాలంటే గాలి చొరబడని ఎన్‌క్లోజర్‌ను ఎంచుకోవాలి. తరిగిన ఉల్లిపాయలను అందులో వేసి ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. అప్పుడు ఉల్లి తాజాగా ఉంటుంది. గాలి చొరబడని బ్యాగ్‌లకు బదులుగా పాలిథిన్ బ్యాగులను కూడా ఉపయోగించవచ్చు. ఉల్లిపాయ ముక్కలను ఒకటి లేదా రెండు రోజులు నిల్వ చేయాలనుకుంటే ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి.




