Besan Face Pack: మచ్చలేని అందం మీ సొంతం కావాలంటే శనగపిండితో ఇలా చేయండి
అనేక మంది ముఖంపై మొటిమల గుర్తులు, ట్యాన్‌ను తొలగించడానికి తరచూ బ్యూటీ పార్లర్‌లకు వెళ్లి ఫేషియల్ చేయించుకుంటారు. కొంతమంది ఇంటి నివారణలపై ఆధారపడతారు. ఇంట్లో దొరికే సెలగ పిండితో కూడా ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మొటిమలు, దద్దుర్లు వంటి పలురకాల సమస్యలన్నింటి నుంచి విముక్తి పొందడానికి సెలగ పిండి ఫేస్ ప్యాక్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. శనగ పిండిలో జింక్ ఉంటుంది. ఇది మొటిమలతో పోరాడటానికి..
Updated on: Nov 10, 2023 | 8:53 PM

కౌమార దశలో హార్మోన్ల ప్రభావం వల్ల ముఖంపై మొటిమలు వస్తుంటాయి. ఆ తర్వాత వాటి తాలూకు మచ్చలు అలాగే ఉండిపోతాయి. కానీ వయసు పెరిగే కొద్దీ చర్మంపై మచ్చలు అసహ్యంగా కనిపిస్తాయి. చాలా మందికి ఈ మచ్చల వెనుక ఖచ్చితమైన కారణం తెలియదు.

మొటిమలు, దద్దుర్లు వంటి పలురకాల సమస్యలన్నింటి నుంచి విముక్తి పొందడానికి సెలగ పిండి ఫేస్ ప్యాక్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. శనగ పిండిలో జింక్ ఉంటుంది. ఇది మొటిమలతో పోరాడటానికి సహాయపడుతుంది. అంతే కాకుండా శెనగపిండిని సరైన పద్ధతిలో ఫేస్ ప్యాక్ ఉపయోగిస్తే, మొటిమల మచ్చలను కూడా తొలగిస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిపిస్తుంది

మీరు జిడ్డుగల చర్మ సమస్యలకు కూడా శనగ పిండిని ఉపయోగించవచ్చు. చర్మంపై పేరుకుపోయిన మురికి, మృతకణాలు, అదనపు నూనెను తొలగించడానికి శనగపిండి సహాయపడుతుంది. ఇది అదనపు నూనె స్రావాన్ని కూడా నియంత్రిస్తుంది.

శనగపిండిలో దోసకాయ రసం, తేనె కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమల మచ్చలు తొలగిపోతాయి. ఈ ఫేస్ ప్యాక్ ముఖ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. మొటిమల సమస్యలను తగ్గిస్తుంది. అలాగే శెనగపిండిని నిమ్మరసం, పెరుగు, పసుపు కలిపి చర్మంపై రాసుకుంటే టాన్ వదిలిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ రాత్రిపూట వేసుకుంటే చర్మకాంతిని పెంచుతుంది.

అలాగే పచ్చి పాలతో శెనగపిండిని కలిపి ముఖానికి రాసుకోవచ్చు. ఇది చర్మాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఈ ఫేస్ ప్యాక్ చర్మ వృద్ధాప్యాన్ని కూడా నివారిస్తుంది.




