Omelette vs Boiled Egg: ఆమ్లేట్.. ఉడికించిన గుడ్డు.. ఏది బరువు వేగంగా తగ్గిస్తుందో తెలుసా?
బరువు తగ్గడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు రోజువారీ ఆహారంలో గుడ్లను కూడా చేర్చుకుంటారు. అయితే గుడ్లు తినడం వల్ల నిజంగా బరువు తగ్గుతారా? ఉడికించిన గుడ్లు లేదా గుడ్డు ఆమ్లెట్ ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Oct 09, 2025 | 1:28 PM

Eggs For Diabetes

బరువు తగ్గడానికి గుడ్లు ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతారు. అందుకే చాలా మంది తమ రోజును గుడ్లతో ప్రారంభిస్తారు. కొందరు ఉడికించిన గుడ్లు తింటారు. మరికొందరు ఆమ్లెట్లు తింటారు.

అయితే బరువు తగ్గడానికి ఉడికించిన గుడ్లు లేదా గుడ్డు ఆమ్లెట్ ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది? అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిలో ఏది వాస్తవానికి ప్రయోజనకరంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం

ఈ రెండింటిలో ఉడికించిన గుడ్లు బరువు తగ్గడానికి మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. అవి త్వరగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. అంతేకాకుండా వాటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

ఉడికించిన గుడ్ల కంటే గుడ్డు ఆమ్లెట్లలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. ఎందుకంటే ఆమ్లెట్లకు అదనంగా మరికొన్ని పదార్ధాలను కలుపుతాం. ఎక్కువ నూనెను కూడా ఉపయోగిస్తాం. ఇది బరువు పెరిగే అవకాశాలను పెంచుతుంది.




