AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care: కళ్ళజోడు వాడకంతో ముక్కుపై మచ్చలు.. ఇట్టే తొలగించే సులువైన చిట్కాలు..

ప్రస్తుత సమాజంలో కంటి సమస్యలు ఎక్కువయ్యాయి. తినే ఆహార పదార్థాల్లో పౌష్టికాహార లోపం వల్ల చూపు మందగిస్తోంది. ముఖ్యంగా విటమిన్లు, ప్రోటీన్ల లోపం వల్ల ఈ సమస్య అధికమౌతోంది. దీంతో ఇష్టమున్నా లేకున్నా కొంతమందికి కళ్లద్దాలు వాడాల్సి వస్తోంది. అయితే అదేపనిగా కళ్లజోడు పెట్టుకోవడం వల్ల కొంతమందికి ముక్కు మీద మచ్చలు పడుతుంటాయి. వాటి ద్వారా తమ అందానికి కాస్త ఇబ్బంది కలుగుతుందని భావిస్తూ ఉంటారు. అయితే అందం కోసం కళ్ళజోడు తీయలేరు. మరి వీటిని ఎలా తగ్గించుకోవాలి? చూద్దాం.

Srikar T
|

Updated on: Jun 16, 2024 | 7:47 AM

Share
ప్రస్తుత సమాజంలో కంటి సమస్యలు ఎక్కువయ్యాయి. తినే ఆహార పదార్థాల్లో పౌష్టికాహార లోపం వల్ల చూపు మందగిస్తోంది. ముఖ్యంగా విటమిన్లు, ప్రోటీన్ల లోపం వల్ల ఈ సమస్య అధికమౌతోంది. దీంతో ఇష్టమున్నా లేకున్నా కొంతమందికి కళ్లద్దాలు వాడాల్సి వస్తోంది.

1 / 5
అయితే అదేపనిగా కళ్లజోడు పెట్టుకోవడం వల్ల కొంతమందికి ముక్కు మీద మచ్చలు పడుతుంటాయి. వాటి ద్వారా తమ అందానికి కాస్త ఇబ్బంది కలుగుతుందని భావిస్తూ ఉంటారు. అయితే అందం కోసం కళ్ళజోడు తీయలేరు. మరి వీటిని ఎలా తగ్గించుకోవాలి? చూద్దాం.

2 / 5
సహజమైన పదార్థాలతో ఈ మచ్చలను తొలగించుకోవచ్చు. వాటిలో బాగా దోహదపడేది కలబంద. కళ్లద్దాల వల్ల ముక్కు మీద ఏర్పడే మచ్చలను తగ్గించడానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కలబంద రసం లేదా అందులో ఉండే జిగురును (జెల్) తీసుకుని మచ్చలు ఉన్న చోట అప్త్లె చేయాలి. ఇలా చేయడం వల్ల త్వరగా ఉపశమనాన్ని పొందవచ్చు.

3 / 5
ఫేషియల్స్ వేసుకున్నప్పుడు కళ్లు విశ్రాంతి పొందడానికి, చల్లగా ఉండటానికి కళ్ల పైన కీరాదోస ముక్కలు పెడతాం. దీనివల్ల కూడా ముక్కు మీద ఏర్పడే మచ్చలు కూడా తగ్గుతాయి. మచ్చలు ఉన్న చోట కీరా రసానికి బంగాళాదుంప, టమాటా రసం కలిపిన ఈ మిశ్రమాన్ని రాయాలి. బాగా ఆరనిచ్చి తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

4 / 5
నారింజ తొక్కల పొడి, పాలు, పెరుగు, బంగాళాదుంప, టమాటా.. ఇలాంటి పదార్థాలను ఉపయోగించి మచ్చలు తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు. అలాగే సబ్బు, గోరు వెచ్చటి నీరు ఉపయోగించి కళ్లద్దాలను శుభ్రపరచాలి. లేదంటే కళ్లద్దాలపై ఏర్పడే బ్యాక్టీరియా వల్ల కంటి చుట్టూ చర్మం నల్లగా మారడం, మచ్చలు ఏర్పడటం జరుగుతుంది.

5 / 5