- Telugu News Photo Gallery Political photos AP CM Chandrababu arranged a special program to know the problems of the people
CM Chandrababu: సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. ప్రజాదర్భార్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం..
ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలతో మమేకం అవుతూ ప్రజా ప్రయోజన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రజా దర్బార్ పేరుతో ప్రజలను కలుసుకుంటున్నారు. వారి సమస్యలను అర్జీల రూపంలో సీఎం చంద్రబాబుకు సమర్పించేందుకు పెద్ద ఎత్తున తన నివాసానికి చేరుకుంటున్నారు బాధితులు. సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టినప్పటిన తొలిరోజే ఐదు హామీలపై సంతకాలు చేశారు. వాటిని అమలు చేసేందుకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక పాలన గాడిలో పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సిద్దమయ్యారు.
Updated on: Jun 16, 2024 | 8:27 AM

ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలతో మమేకం అవుతూ ప్రజా ప్రయోజన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రజా దర్బార్ పేరుతో ప్రజలను కలుసుకుంటున్నారు. వారి సమస్యలను అర్జీల రూపంలో సీఎం చంద్రబాబుకు సమర్పించేందుకు పెద్ద ఎత్తున తన నివాసానికి చేరుకుంటున్నారు బాధితులు.

సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టినప్పటిన తొలిరోజే ఐదు హామీలపై సంతకాలు చేశారు. వాటిని అమలు చేసేందుకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక పాలన గాడిలో పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో కొందరు వృద్దులు తమ కుటుంబ పరిస్థితిని చెప్పుకున్నారు.

తొలిసంతకం డీఎస్సీపై పెట్టడంతో అటు నిరుద్యోగులు కూడా కదం తొక్కారు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఙతలు తెలుపుకునేందుకు ఉండవల్లికి చేరుకున్నారు. అలాగే ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిరుద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

శనివారం ఏర్పాటు చేసిన ప్రజా దర్భార్ కార్యక్రమంలో చాలా మంది ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారు. అలాగే వారి పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరాతీశారు. వారికి సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వికలాంగులు తమకు పెన్షన్ ఇవ్వమని అర్జీ పెట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో కొందరు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. గతంలో జై తెలుగుదేశం అంటే తమపై దాడులు చేశారని చెప్పుకున్నారు. వారికి అండగా నిలిచేందుకు పార్టీ ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఒకవైపు పార్టీ కార్యకర్తలు, మరోవైపు అర్జీలు పట్టుకుని వచ్చిన బాధితులతో క్యాంపు కార్యాలయం మొత్తం హడావిడిగా కనిపించింది.
