Pvv Satyanarayana | Edited By: Rajitha Chanti
Updated on: Jun 16, 2024 | 9:53 PM
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనసలో పవన్ కళ్యాణ్ కు విజయం వరించడంతో ఊరంతా కలిసి మొక్కులు తీర్చుకున్నరు గ్రామస్తులు. పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించడంతో గ్రామంలో ఉన్న పోలేరమ్మ అమ్మవారికి ఊరంతా కలసి 101 కోళ్లతో మొక్కులు తీర్చుకున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అమలాపురం వచ్చిన పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని పోలేరమ్మకు పూజ చేసిన వెండి పూలతో విజయ దండ చేయించి పవన్ కళ్యాణ్ మెడలో వేశారు సమనస గ్రామ వైస్ ప్రెసిడెంట్ జనసేన వీర అభిమాని మామిడపల్లి దొరబాబు పవన్ కళ్యాణ్ మెడలో వేశారు.
పిఠాపురం నుండి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించడం తోపాటు ఉప ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించడంతో అభిమాని దొరబాబు తోపాటు గ్రామస్తులు అంతా కలిసి గ్రామ దేవత పోలేరమ్మ కు ఊరందరు కలిసి కోళ్లు పట్టుకుని అమ్మవారి ఆలయం వద్ద మొక్కులు తీర్చుకున్నారు.
పవన్ కళ్యాణ్ మరిన్ని విజయాలు సాధించాలని సమనస ఊరు ఊరంత కోలాహలంగా పండగలా చేసుకున్నారు. గ్రామదేవత పోలేరమ్మకు నైవేద్యం లతో అమ్మవారికి పూజలు చేసి కోళ్ళ ను ఊరిలో ఉన్న మరి కొందరికి పంచిపెట్టారు.
పవన్ ప్రతి విజయం వెనుక పోలేరమ్మ ఆశీస్సులు ఉండాలని భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలను పవన్ అధిరోహించాలని గ్రామస్తులు కోరారు.అయితే ఊరందరు ఒకేసారి కోళ్లు చేతపెట్టుకుని అమ్మవారి ఆలయం దగ్గరకు కలిసి రావడంతో అందరిని ఆకట్టుకుంది.