- Telugu News Photo Gallery Natural Hair Masks: Try This Effective Homemade Hair Mask Using Olive Oil for Dry Hair
Olive Oil Hair Mask: జుట్టు మృదువుగా పట్టులా మారాలంటే.. ఆలివ్ ఆయిల్‌తో ఇలా చేసి చూడండి!
సహజ నూనె జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతాయి. కురులకు మేలు చేసే సహజ నూనెల్లో ఆలివ్ నూనె మొదటి వరుసలో ఉంటుంది. ఈ నూనెలో విటమిన్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్‌ని ఉపయోగిస్తే జుట్టు సమస్యలను సులభంగా నియంత్రించవచ్చు. ఇది జుట్టును మృదువుగా చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చాలా మంది పొడి బారిన జుట్టుతో బాధపడుతుంటారు. దీనికి ప్రధానంగా కాలుష్యం. చెమట వేడికి..
Updated on: Oct 13, 2023 | 8:59 PM

సహజ నూనె జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతాయి. కురులకు మేలు చేసే సహజ నూనెల్లో ఆలివ్ నూనె మొదటి వరుసలో ఉంటుంది. ఈ నూనెలో విటమిన్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి.

ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్‌ని ఉపయోగిస్తే జుట్టు సమస్యలను సులభంగా నియంత్రించవచ్చు. ఇది జుట్టును మృదువుగా చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చాలా మంది పొడి బారిన జుట్టుతో బాధపడుతుంటారు. దీనికి ప్రధానంగా కాలుష్యం. చెమట వేడికి జుట్టు మరింత జిగటగా మారుతుంది. దీని వల్ల జుట్టు రాలడం ఎక్కువవుతుంది.

ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది హెయిర్ పాలిషింగ్ చేస్తుంటారు. కొందరు స్మూటింగ్, కెరాటిన్ కూడా చేస్తారు. కానీ సమస్యను శాశ్వతంగా పారదోలలేరు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ అదే సమస్య మొదలవుతుంది.

జుట్టును సహజంగా మృదువుగా ఉంచడానికి ఆలివ్ ఆయిల్ ఉపయోగపడుతుంది. వెంట్రుకలకు సహజ పద్ధతుల్లో చికిత్స అందించి, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. పుల్లటి పెరుగు జుట్టుకు చాలా మంచిది. ఒక గిన్నెలో నాలుగు చెంచాల పెరుగు తీసుకుని, దానిలో ఒక స్పూన్ తేనే, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం దానిని జుట్టుకు పట్టించాలి.

జుట్టు రాలడాన్ని తగ్గించడానికి విటమిన్ ఇ క్యాప్సూల్ ఉపయోగపడుతుంది. అవసరం అయితే ఈ మిశ్రమంలో ఒక విటమిన్ ఇ క్యాప్యూల్ కూడా కలుపుకోవచ్చు. ఈ ప్యాక్‌ని 2 గంటల పాటు ఆంచుకుని, తర్వాత షాంపూతో తలస్నానం చేసుకుంటే సరి.





























