AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోషకాల పవర్ హౌస్.. మేకలోని ఆ పార్ట్ తిన్నారంటే ఇక తిరుగుండదు..

మటన్ చాలామంది ఇష్టంగా తింటారు. దీంతో అనేక ప్రయోజనలు ఉన్నాయి. మరి మీరు మటన్ తిల్లీ ఎప్పుడైనా తిన్నారా.? మటన్ తిల్లీ అనేది పోషకాలతో కూడిన పార్ట్, ఇది అధిక ఐరన్ కంటెంట్ కారణంగా రక్తహీనతను నివారించడం, దాని ప్రోటీన్ కండరాల పెరుగుదలకు మద్దతు ఇవ్వడంలో సహాయపడతాయి. వివిధ ముఖ్యమైన ఖనిజాలు. విటమిన్ల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఇది రక్త ప్రసరణకు కూడా సహాయపడుతుంది. కణజాల మరమ్మత్తుకు మద్దతు ఇస్తుంది.

Prudvi Battula
|

Updated on: Nov 23, 2025 | 1:37 PM

Share
మటన్ తిల్లిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా రక్తం తక్కువగా ఉన్నవారు దీనిని తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. శరీరంలోని పాత, దెబ్బతిన్న ఎర్ర రక్త కణాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త ఎర్ర రక్త కణాలను ప్రొడ్యూస్ చేయడానికి ఇది ఉపకరిస్తుంది. అంతేకాకుండా, తెల్ల రక్త కణాల వృద్ధిని ప్రోత్సహించి, అవి వివిధ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి తోడ్పడుతుంది.

1 / 5
క్యాన్సర్, చర్మ అలెర్జీలు, కిడ్నీ సంబంధిత రుగ్మతలు, రక్త సంబంధిత వ్యాధులు, అలాగే కొన్ని రకాల హెచ్‌ఐవి సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి మటన్ తిల్లి తీసుకోవడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుందని పేర్కొనబడింది. చిన్నపిల్లలలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి, వయసు పైబడిన వారిలో కూడా రక్త వృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

2 / 5
ఇన్ని ప్రయోజనాలు ఉన్న మటన్ తిల్లి వండుకోవడానికి  పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే మీరో ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే కుంచెం కష్టపడాలి అంతే.. మటన్ తిల్లి వండడానికి కొన్ని పదార్దాలు అవసరం అవుతాయి. దీని కోసం మటన్ తిల్లి, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చినచెక్క, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కొత్తిమీర కావాలి.

3 / 5
మొదటగా, నీటిలో బిర్యానీ ఆకు, రెండు లవంగాలు, ఒక దాల్చినచెక్క వేసి బాగా మరిగించాలి. కట్ చేసి శుభ్రం చేసుకున్న మటన్ తిల్లిని ఈ మరుగుతున్న నీటిలో వేసి కేవలం ఒక నిమిషం పాటు ఉడికించాలి. ఎక్కువసేపు ఉడికించకూడదు. ఈ ప్రక్రియ వల్ల తిల్లికి ఉండే సహజసిద్ధమైన వాసన పూర్తిగా తొలగిపోతుంది. ఆ తరువాత, తిల్లిని నీటి నుండి తీసి, దానికి తగినంత ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

4 / 5
తరువాత, ఒక పాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక, స్టవ్‌ను సిమ్‌లో ఉంచి, మసాలాలు కలిపిన తిల్లి ముక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి. ఇలా చేయడం వల్ల నూనె చిందకుండా సురక్షితంగా ఉంటుంది. తిల్లి ముక్కల్లోని నీరంతా ఆవిరైపోయి, నూనె పైకి తేలే వరకు మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ వేయించాలి. మటన్ లివర్ ఫ్రై మాదిరిగానే ఇది కూడా నల్లగా అవుతుంది. చివరగా, ఇంట్లో తయారుచేసిన గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు ఉడికించి, స్టవ్ ఆపివేయాలి. ఈ పద్ధతిలో చేసిన తిల్లి కర్రీ చాలా రుచికరంగా ఉంటుంది.

5 / 5