గూగుల్ మ్యాప్స్‌లో వచ్చే వాయిస్ ఎవరిదో తెలుసా ?.. ఆమె గురించి తెలుసుకోవాల్సిందే
ఒక్కప్పుడు ఎక్కడికైనా వెళ్లాలంటే దారి తెలియకపోతే ఇతరులను అడగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వల్ల గూగుల్ మ్యాప్స్ చూసి ఎక్కడికంటే అక్కడికి దర్జాగా వెళ్లేస్తున్నాం. అందులో ఓ మహిళ వాయిస్ మనకు డైరెక్షన్స్ కూడా చెప్తుంది. మరి ఇంతలా మనకు సాయపడుతున్న ఆ మహిళ ఎవరు అని ఎప్పుడైనా ఆలోచించారా ?
Updated on: Jul 25, 2023 | 12:13 PM

ఒక్కప్పుడు ఎక్కడికైనా వెళ్లాలంటే దారి తెలియకపోతే ఇతరులను అడగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వల్ల గూగుల్ మ్యాప్స్ చూసి ఎక్కడికంటే అక్కడికి దర్జాగా వెళ్లేస్తున్నాం. అందులో ఓ మహిళ వాయిస్ మనకు డైరెక్షన్స్ కూడా చెప్తుంది. మరి ఇంతలా మనకు సాయపడుతున్న ఆ మహిళ ఎవరు అని ఎప్పుడైనా ఆలోచించారా ?

ఆమె పేరు కరెనా జాకబ్‌సన్. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే జీపీఎస్ ఫీచర్‌లో సిరి అనే వర్చువల్ వాయిస్‌కి స్వరాన్ని అందించింది ఈమెనె. కరెనా ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో పుట్టింది. ఆమెకు ఏడేళ్ల వయసున్నప్పుడే పాటలు రాయడం, పాడటం వంటివి చేసేది. ఎప్పిటికైనా ఓ ప్రముఖ సింగర్ అవ్వాలనేది ఆమె కళ. అందుకోసం అమెరికాలోని న్యూయార్క్‌కు వచ్చేసింది.

న్యూయార్క్‌లో ఓరోజు కరెన్ టెక్స్ట్ టు స్పీచ్ వాయిస్ సిస్టమ్‌ను రికార్డ్ చేసే ఆడిషన్స్ జరిగాయి. ఈ ఆడిషన్స్‌కి కరెనా కూడా వెళ్లింది. ఆ ఒక్కసారి ఇచ్చిన వాయిస్ ఓవర్ ఆమెను జీపీఎస్ గర్ల్‌గా బ్రాండ్ నేమ్ తెప్పించింది. ఆ తర్వాత ఆమె అనేక వ్యాపారాల్లోకి అడుగుపెట్టింది. ఇక చివరికి ఆమె ఇంటర్నేషనల్ స్పీకర్‌గా మారిపోయింది.

కరెనా జాకబ్‌సన్ ఎన్నో యూనివర్సిటీల్లో టెడ్‌ఎక్స్ స్పీకర్‌గా ఫైనాన్స్, హెల్త్, ఎడ్యుకేషన్, ట్రావెల్, రియల్ ఎస్టేట్‌తో సహా ఎన్నో బహుళ పరిశ్రమలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన గాత్రాన్ని అందించింది. ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్స్ ఎన్‌బీసీ టుడే షో, ఏబీసీ వరల్డ్ న్యూస్ టునైట్ వంటివి ఆమెను పవర్‌ఫుల్ ఉమెన్‌గా కీర్తించాయి.

కస్టమైజ్డ్ వాయిస్ సిస్టమ్స్‌లో, అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్‌లలో కరెన్ జాకబ్‌సన్ వాయిస్ ఓవర్‌కి చాలా డిమాండ్ ఉంది. ఓ పాప్ సింగర్‌గా ఎన్నో అవార్డులు గెలుచుకొని ముందుకు వెళ్తుండగా ఓసారి చేసిన టెక్స్ట్ టు స్పీచ్ సెలబ్రేటీ స్థాయిని తీసుకొచ్చింది. చివరికి ఆమె స్వరమే తనను అంతర్జాతీయ వాయిస్ ఓవర్‌గా స్థిరపడేలా చేసింది.





























