AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Mango: ఈ మామిడి పండు టూ స్పెషల్ గురూ.. చుట్టూ నలుగురు బాడీ గార్డ్స్ ఉండాల్సిందే..!

Special Mango: సాధారణంగానే మామిడిని పండ్లకు రారాజు అని పిలుస్తారు. భారతదేశంలో జాతీయ పండు హోదాను కూడా పొందింది.

Shiva Prajapati

|

Updated on: Jul 23, 2022 | 5:46 AM

Special Mango: సాధారణంగానే మామిడిని పండ్లకు రారాజు అని పిలుస్తారు. భారతదేశంలో జాతీయ పండు హోదాను కూడా పొందింది. ప్రపంచంలో అనేక రకాల మామిడి పండ్లు ఉన్నప్పటికీ. వాటిలో దుస్సేరి, చౌసా, లాంగ్రా వంటి ఫేమస్ పండ్లు ఉన్నాయి. ఈ మామిడికాయలు భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందాయి. ఈ పండ్లను ప్రజలు చాలా ఇష్టపడతారు. సాధారణంగా మామిడి కాయలు.. మార్కెట్‌లో కిలో 80-100 రూపాయలకు లభిస్తాయి. కానీ, ఇవ్వాల మనం చెప్పుకోబోయే మామిడిపండ్ల ధర తెలిస్తే మాత్రం గుండెలదిరిపోవడం ఖాయం. ఈ పండ్లు సామాన్యులకు బహుదూరం. ధనవంతులు మాత్రమే కొనుక్కునే పరిస్థితి ఉంది.

1 / 5
ఈ మామిడిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిగా పిలుస్తారు. దీనిని మొదట జపాన్‌లోని మియాజాకిలో కనుగొన్నారు. కానీ ఇప్పుడు ఈ మామిడిని భారతదేశంతో సహా అనేక ఇతర ప్రదేశాలలో సాగు చేస్తున్నారు. అయితే, ఈ మామిడిని కొనడం అనేది సామాన్యులకు అయ్యేది కాదు.

2 / 5
మధ్యప్రదేశ్‌‌‌లోని జబల్పూర్‌కు చెందిన సంకల్ప్ పరిహార్ తన తోటలో ఈ మామిడి చెట్టును నాటాడు. దీని రక్షణ కోసం నలుగురు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేశాడు. పైగా రెండు అత్యంత ప్రమాదకరమైన కుక్కలను కూడా కాపలాగా పెట్టారు. ఈ మామిడిని ‘తైయో నో టమాగో’ లేదా మియాజాకి మామిడి అని పిలుస్తారు. దీనిని ‘ఎగ్ ఆఫ్ ది సన్’ అని కూడా పిలుస్తారు.

3 / 5
సగం ఎరుపు, సగం పసుపు రంగులో ఉండడం ఈ మామిడి ప్రత్యేకత. జపాన్‌లో, ఈ మామిడిని వేసవి, చలికాలం మధ్య కాలంలో ప్రత్యేక క్రమంలో తయారుచేస్తారు. ఈ మామిడి ధర చాలా ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం. ఈ మామిడికాయ తినడానికి చాలా రుచిగా, జ్యుసిగా ఉంటుంది.

4 / 5
ఈ మామిడి పండ్ల ధర కిలో 2.5 లక్షల రూపాయల కంటే ఎక్కువగానే ఉంటుంది. కొన్నేళ్ల క్రితం జపాన్‌లో ఈ మామిడి పళ్లు జత సుమారు 2.72 లక్షల రూపాయలకు విక్రయించగా, అందులో ఒక మామిడికాయ బరువు 350 గ్రాములు. 700 గ్రాముల మామిడి కాయలు 2.5 లక్షల రూపాయలకు పైగా అమ్ముడైంది. ఈ నేపథ్యంలో ఒక కిలో మామిడి పండ్లను కొనడానికి ఎంత డబ్బు వెచ్చించాల్సి వస్తుందో ఊహించుకోవచ్చు.

5 / 5
Follow us