ఆ వ్యాధిగ్రస్తులకు ఈ సూపర్ ఫుడ్ వారికి విషంతో సమానమట.. తినే ముందు ఆలోచించండి!
ఒకప్పుడు, మఖానాను పూజలు చేసినప్పుడూ,లేదా ఉపవాసం చేసేటప్పుడు మాత్రమే తినేవారు. కానీ ఇప్పుడు డైట్స్ చేసే వారు ఎక్కువగా దీన్ని తింటున్నారు. ఫాక్స్ నట్స్' లేదా 'లోటస్ సీడ్స్' అని పిలువబడే ఈ ఆహారాన్ని సూపర్‌ఫుడ్ అంటారు. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇది అందరికి ప్రయోజనకరంగా ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని వ్యాధులతో బాధపడే వ్యక్తులు వీడిని తినడం వల్ల అనారోగ్యం సమస్యలు ఎదుర్కోవచ్చని చెబుతున్నారు. కాబట్టి వీటిని ఎవరూ తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Sep 20, 2025 | 4:01 PM

కిడ్నీ రోగులు: మఖానాలో పొటాషియం అధికంగా ఉంటుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఎక్కువ పోటాషియం ఉన్న ఫుడ్స్ తీసుకోకూడదు. ఒక వేళ ఎక్కు పోటాషియం ఉన్న ఫుడ్స్ తీసుకుంటే హార్ట్‌బీట్‌పై ప్రభావం చూపుతుంది. ఆలాగే ఇతర తీవ్రమైన సమస్యలకు కూడా వస్తాయి.

డయాబెటిక్ రోగులు: మఖానాను తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారంగా పరిగణిస్తున్నప్పటికీ, దీన్ని ఎక్కువ మొత్తంలో తినడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్‌లో మార్పులు వస్తాయి. కాబట్టి, డయాబెటిస్ ఉన్న వారు వీటిని వైద్యులు చెప్పినన మోతాదులోనే తీసుకోండి, లేదంటే వాటికి ఆల్‌టర్నేట్‌గా ఉండే ఫుడ్‌ను తినండి.

జీర్ణ సమస్యలు ఉన్నవారు: జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా మఖానాకు దూరంగా ఉండండి. మఖానాలోని ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని ఎక్కువగా తినడం వల్ల అపానవాయువు, గ్యాస్, మలబద్ధకం సమస్యలు పెరుగుతాయి.జీర్ణవ్యవస్ బలహీనంగా ఉన్నవారు వీటిని ఎక్కువగా తింటే సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

అలెర్జీ బారినపడే వ్యక్తులు: కొంతమందికి కొన్ని ఫుడ్స్ తింటే అలెర్జీ వస్తుంది. కాబట్టి మఖానా అంటే అలెర్జీ ఉన్న వారు వీటికి దూరంగా ఉండండి. వీటిని తిన్నప్పుడు మీరు దురద, దద్దుర్లు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటే మీరు వెంటనే దానిని తినడం మానేయాలి.

Makhana




