AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెల పాటు నిల్వ ఉండే కమ్మని టమాటా పచ్చడి.. అన్నం మొత్తం కడుపునిండా తినేస్తారు!

ఇంట్లో తయారు చేసుకునే పచ్చళ్లలో టమాటా పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే కడుపు నిండా తిన్న అనుభూతిని ఇస్తుంది. అంతేకాదు, ఇడ్లీ, దోసె వంటి అల్పాహారాలకు కూడా ఈ పచ్చడి చక్కటి జోడీ. మిక్సీ అవసరం లేకుండా, సులభమైన పద్ధతిలో రుచికరమైన టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ పచ్చడి ఫ్రిజ్‌లో నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది..

Srilakshmi C
|

Updated on: Nov 08, 2026 | 12:37 PM

Share
ఇంట్లో తయారు చేసుకునే పచ్చళ్లలో టమాటా పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే కడుపు నిండా తిన్న అనుభూతిని ఇస్తుంది. అంతేకాదు, ఇడ్లీ, దోసె వంటి అల్పాహారాలకు కూడా ఈ పచ్చడి చక్కటి జోడీ. మిక్సీ అవసరం లేకుండా, సులభమైన పద్ధతిలో రుచికరమైన టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ పచ్చడి ఫ్రిజ్‌లో నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది.

1 / 5
కావాల్సిన పదార్థాలు.. టమాటాలు: అర కేజీ, వెల్లుల్లి రెబ్బలు: 10-15 (తాలింపు కోసం మరికొన్ని), అల్లం: రెండు చిన్న ముక్కలు, చింతపండు: చిన్న నిమ్మపండు సైజు, ఆవాలు: 1 టేబుల్ స్పూన్ (వేయించి పొడి చేయడానికి) + 1/2 టీస్పూన్ (తాలింపు కోసం), జీలకర్ర: 1/2 టీస్పూన్ (వేయించి పొడి చేయడానికి) + 1/2 టీస్పూన్ (తాలింపు కోసం), మెంతులు: 1/4 టీస్పూన్ (వేయించి పొడి చేయడానికి), ఉప్పు: రుచికి సరిపడా (సుమారు 1 1/2 టేబుల్ స్పూన్), కారం: రుచికి సరిపడా (సుమారు 2 1/2 టేబుల్ స్పూన్లు), నూనె: తగినంత (పచ్చడికి కొంచెం ఎక్కువగానే పడుతుంది), కరివేపాకు: కొద్దిగా, ఎండుమిర్చి: 2 (తాలింపు కోసం), మినపప్పు: కొద్దిగా (తాలింపు కోసం), పసుపు: 1/4 టీస్పూన్ చొప్పున తీసుకోవాలి.

2 / 5
ముందుగా అర కేజీ టమాటాలను శుభ్రంగా కడిగి, పైన ఉన్న తొడిమ భాగాన్ని తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. పండిన టమాటాలు వాడితే రుచి మరింత బాగుంటుంది. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, రెండు చిన్న అల్లం ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను పాన్‌లో వేయాలి. దాంట్లోకి నారలు తీసిన చిన్న నిమ్మపండు సైజు చింతపండును కూడా చేర్చాలి. అంతా బాగా కలిపి మూతపెట్టి, టమాటా ముక్కలు చక్కగా సాఫ్ట్‌గా, మెత్తగా మగ్గే వరకు ఉడికించాలి. మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. టమాటాలు పూర్తిగా మెత్తగా గుజ్జులా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఈ పచ్చడికి మిక్సీలో గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, అందుకే బాగా మగ్గించడం ముఖ్యం. మనం వేసిన వెల్లుల్లి, అల్లం, చింతపండు కూడా టమాటాలతో పాటు మెత్తగా మగ్గిపోతాయి.

3 / 5
టమాటాలు పూర్తిగా మగ్గి గుజ్జులా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, కొద్దిసేపు చల్లారనివ్వాలి. కొద్దిగా చల్లారాక, పప్పుగుత్తి లేదా ఏదైనా స్మాషర్‌తో టమాటా గుజ్జును మెత్తగా మెదుపుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, చింతపండు అన్నీ బాగా మెదిగిపోతాయి. మరో చిన్న పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీస్పూన్ జీలకర్ర, 1/4 టీస్పూన్ మెంతులు వేసి దోరగా వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడిని మెదిపి పెట్టుకున్న టమాటా గుజ్జులో కలపాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు (సుమారు 1 1/2 టేబుల్ స్పూన్), కారం (సుమారు 2 1/2 టేబుల్ స్పూన్లు) వేసి, పచ్చడికి అంతా బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. పచ్చడి కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది.  స్టవ్ మీద ఒక పాన్ పెట్టి పచ్చడికి సరిపడా నూనె వేసుకోవాలి (కొంచెం ఎక్కువే పడుతుంది). నూనె వేడెక్కాక కొద్దిగా కరివేపాకు, రెండు ముక్కలుగా చేసుకున్న ఎండుమిర్చి, కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీస్పూన్ ఆవాలు, 1/2 టీస్పూన్ జీలకర్ర, కొద్దిగా మినపప్పు, 1/4 టీస్పూన్ పసుపు వేసి చిన్న మంటపై బాగా వేయించుకోవాలి. మినపప్పు దోరగా వేగి బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి.

4 / 5
తాలింపు చక్కగా వేగిన తర్వాత, మెదిపి పెట్టుకున్న టమాటా పచ్చడిని తాలింపులో వేసి అంతా బాగా కలుపుకోవాలి. తాలింపులో పచ్చడి పూర్తిగా కలిసేలా చూసుకోవాలి. ఇలా కలిపిన పచ్చడిని మూతపెట్టి, చిన్న మంట మీద రెండు నుంచి మూడు నిమిషాలు నూనె పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పచ్చడి చల్లారాక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే, ఫ్రిజ్‌లో ఒక నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటే దాని రుచి అద్భుతం. టిఫిన్‌లలో కూడా ఇది చాలా బాగుంటుంది.

5 / 5
Follow Us
నెల పాటు నిల్వ ఉండే కమ్మని టమాటా పచ్చడి.. కడుపునిండా తినేస్తారు!

తెలంగాణ గ్రామాలకు గుడ్‌న్యూస్.. ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్!

ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు

రెండు వన్డేల్లో గెలిచినా.. ఈ ముగ్గురితో గంభీర్‌కు టెన్షనే..!

నీటి చుక్క పడగానే వెలిగే దీపం..కరెంట్ లేకుండానే ఎలా పని చేస్తుంది

దీపావళి అమావస్య.. ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షమే

ఒకప్పుడు టీమిండియా సూపర్‌స్టార్లు.. గంభీర్ ఎంట్రీతో టీం నుంచి ఔట్

కొత్త పెళ్లి కూతురిలా తీన్మార్ డ్యాన్స్‌ ఇరగదీసింది..

కస్టమర్లలా వచ్చి కళ్లముందే మాయం చేశారు.. జ్యువెలరీ షాపులో..

లక్ష్మీదేవికి ఏ పూలు సమర్పిస్తే అదృష్టమో తెలుసా?