AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Idupu Kayitham : నాగదుర్గ మజాకా.. తీన్మార్ డ్యాన్స్‌తో అదరగొట్టింది.. ఇడుపు కాయితం నుంచి మాస్ సాంగ్ రిలీజ్..

ప్రియదర్శి హీరోగా, సోషల్ మీడియా సెన్సేషన్ నాగదుర్గ నాయికగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న 'ఇడుపు కాయితం'. వచ్చే నెల 11న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి తాజాగా 'బారాత్ బీట్' మాస్ సాంగ్ విడుదలయ్యింది. కొత్త పెళ్లికూతురు గెటప్‌లో నాగదుర్గ వేసిన ఎనర్జిటిక్ తీన్మార్ స్టెప్స్ ప్రస్తుతం యూట్యూబ్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.

Idupu Kayitham : నాగదుర్గ మజాకా.. తీన్మార్ డ్యాన్స్‌తో అదరగొట్టింది.. ఇడుపు కాయితం నుంచి మాస్ సాంగ్ రిలీజ్..
Idupu Kayitham
Rajitha Chanti
|

Updated on: Nov 08, 2026 | 12:10 PM

Share

సోషల్ మీడియాలో ఫోక్ సాంగ్స్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది నాగదుర్గ. ఇప్పటివరకు ఎన్నో పాటలలో కనిపించిన ఆమె ఇప్పుడు వెండితెరపై కథానాయికగా సందడి చేసేందుకు రెడీ అయ్యారు. ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ కథానాయికగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఇడుపు కాయితం. తెలంగాణ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి క్యూరియాసిటీ నెలకొంది. ఇదివరకు విడుదలైన పాటలు అటు యూట్యూబ్, ఇటు సోషల్ మీడియాలో దుమ్మురేపాయి. ఇక ఈ మూవీ పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే దీపావళి సందర్భంగా ఈ సినిమాను మంచి మాస్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇందులో ఎప్పటిలాగే నాగదుర్గ డ్యాన్స్ ఇరగదీసింది. పెళ్లైన తర్వాత సాగే బరాత్ లో ప్రియదర్శికి ఝలక్ ఇచ్చింది. సాంప్రదాయ పట్టు చీర ధరించి, తలపై తలపాగాతో కొత్త పెళ్లికూతురిగా నాగుదుర్గ వేసిన మాస్ తీన్మార్ స్టెప్స్ యూత్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు ‘సుకుమార్ రైటింగ్స్’ , ‘బన్నీ వాస్’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సురేశ్ బొబ్బిలి అందించిన అదిరిపోయే జానపద బీట్స్, డ్రమ్స్ మోతకు తగ్గట్టుగా నాగదుర్గ చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

పల్లెటూరి వివాహ వేడుకల వాతావరణంలో సాగే ఈ పాటలో హీరో ప్రియదర్శి, ఇతర నటీనటుల హావభావాలు కూడా చాలా సహజంగా ఉన్నాయి. ఈ మాస్ సాంగ్ విడుదలైన తక్కువ సమయంలోనే యూట్యూబ్‌లో లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతూ ట్రెండింగ్‌లో నిలిచింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం డిసెంబర్ 11, 2026న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

ఇడుపు కాయితం సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Follow Us
కొత్త పెళ్లి కూతురిలా తీన్మార్ డ్యాన్స్‌ ఇరగదీసింది..
కొత్త పెళ్లి కూతురిలా తీన్మార్ డ్యాన్స్‌ ఇరగదీసింది..
కస్టమర్లలా వచ్చి కళ్లముందే మాయం చేశారు.. జ్యువెలరీ షాపులో..
కస్టమర్లలా వచ్చి కళ్లముందే మాయం చేశారు.. జ్యువెలరీ షాపులో..
లక్ష్మీదేవికి ఏ పూలు సమర్పిస్తే అదృష్టమో తెలుసా?
లక్ష్మీదేవికి ఏ పూలు సమర్పిస్తే అదృష్టమో తెలుసా?
నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు పెళ్లిపీటలెక్కిన క్రేజీ హీరోయిన్
నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు పెళ్లిపీటలెక్కిన క్రేజీ హీరోయిన్
అవినీతి ఆరోపణలు.. పరాగ్వే అధ్యక్షుడిపై అభిశంసన వేటు
అవినీతి ఆరోపణలు.. పరాగ్వే అధ్యక్షుడిపై అభిశంసన వేటు
3 నెలల క్రితమే అరంగేట్రం.. 2027 వన్డే ప్రపంచకప్‌లో చోటు ఫిక్స్..!
3 నెలల క్రితమే అరంగేట్రం.. 2027 వన్డే ప్రపంచకప్‌లో చోటు ఫిక్స్..!
10 నిమిషాల్లో ఉల్లి టమాటో చట్నీ.. వారానికి 3సార్లు చేసిన వద్దనరు!
10 నిమిషాల్లో ఉల్లి టమాటో చట్నీ.. వారానికి 3సార్లు చేసిన వద్దనరు!
స్వామి ఊపిరితో కదిలే దీపం.. వాడపల్లి నరసింహుడి గర్భగుడిలో..
స్వామి ఊపిరితో కదిలే దీపం.. వాడపల్లి నరసింహుడి గర్భగుడిలో..
రాజకీయ గురువు.. మార్గదర్శిని గుర్తుచేసుకుంటూ మోదీ భావోద్వేగం!
రాజకీయ గురువు.. మార్గదర్శిని గుర్తుచేసుకుంటూ మోదీ భావోద్వేగం!
అతని వల్లే మాకు ఆ 4 పరుగులు.. లేకుంటే మ్యాచ్ దొబ్బేది
అతని వల్లే మాకు ఆ 4 పరుగులు.. లేకుంటే మ్యాచ్ దొబ్బేది