శని ఎఫెక్ట్ : 2027 వరకు ఈ రాశుల వారికి తిరుగే లేదు.. ఇంట్లో కనక వర్షమే!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక, గ్రహాల సంచారం అనేది సహజం. నెలకు ఒకసారి లేదా కొన్ని గ్రహాలు ఆరు నెలలకు ఒకసారి సంచారం చేస్తుంటాయి. అయితే కొన్ని గ్రహాల సంచారం అనేది 12 రాశులపై ప్రభావం చూపగా, కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. కాగా, శని సంచారం కొన్ని శుభయోగాలను తీసుకొస్తుంది. దీంతో నాలుగు రాశుల వారికి కలిసి వస్తుంది. ఆ రాశులు ఏవి అంటే?
Updated on: Jul 11, 2025 | 1:57 PM

గ్రహాలలో కెళ్లా, శని గ్రహం చాలా శక్తివంతమైనది. ఇది మంచి స్థానంలో ఉంటే అనేక శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే ఇప్పటి వరకు కుంభ రాశిలో సంచరిస్తున్న శని మార్చి నెలలో మీన రాశిలోకి సంచారం చేసిన విషయం తెలిసిందే, అయితే 2027 వరకు శని గ్రహం మీన రాశిలోనే సంచరిస్తుంటుంది. దీని వలన కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడి మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది.

మకర రాశి : మకర రాశి వారిపై శని ప్రభావం అనుకూలంగా ఉండటంతో ఈ రాశి వారికి ఆర్థికంగా అద్భతంగా ఉండబోతుంది. అంతే కాకుండా వీరు అన్ని పనుల్లో మంచి విజయాలు పొందతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందే ఛాన్స్ ఉంది. ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారు జాబ్ సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం చోటుచేసుకుంటుంది.

మీన రాశి : మీన రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం వలన చేపట్టి పనుల్లో ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. శని ప్రభావంతో ఈ రాశి వారికి 2027 వరకు డబ్బు సమస్యలే ఉండవు. అంతే కాకుండా అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. దీంతో ఇంట్లో తరగిపోని సంపద పెరిగి, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉండటంతో, కుటుంబ సభ్యులతో చాలా ఆనదంగా గడుపుతారు.

మిథున రాశి : మిథున రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం వలన ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంది చాలా లాభదాయకంగా ఉంటాయి. అంతే కాకుండా ప్రతి పనుల్లోనూ వీరికి లాభం చేకూరుతుంది. వ్యాపారస్తులకు, ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు చేకూరే ఛాన్స్ ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

అంతే కాకుండా మిథున రాశి వారిపై శని సానుకూల ప్రభావం చూపడంతో ఈ రాశి విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. ఇక వైవాహిక బంధంలో సమస్యలు తొలిగిపోతాయి. చాలా ఆనదంగా గడుపుతారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. చేతినిండా డబ్బు ఉంటుంది



