AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutton Liver Fry: కుమారి ఆంటీ స్పెషల్: ఘుమఘుమలాడే స్ట్రీట్ స్టైల్ మటన్ లివర్ ఫ్రై.. చేసేయండి చక.. చకా.. 

హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటే అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు 'కుమారి ఆంటీ'. ఐటీ కారిడార్‌లో తన చేతి వంటతో వేలాది మంది కడుపు నింపే కుమారి ఆంటీ, అప్పటికప్పుడు వేడివేడిగా వడ్డించే నాన్‌వెజ్ వంటకాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా  కుమారి ఆంటీ చెప్పిన లివర్ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Phani CH
|

Updated on: May 23, 2026 | 9:15 AM

Share
కుమారి ఆంటీ వంటకాల ప్రత్యేకత ఏంటంటే... ఆమె బయటి మసాలాలను అస్సలు వాడరు. బాణలిలో నూనె బాగా కాగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయిస్తారు. ఆ తర్వాత ఇంట్లోనే స్వయంగా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి పచ్చివాసన పోయేలా వేపుతారు.

1 / 5
తరువాత మార్కెట్ నుండి తెచ్చిన రెండు కిలోల తాజా మటన్ లివర్  శుభ్రంగా కడిగి అందులో వేయాలి. అప్పటికప్పుడే కోయించిన ఫ్రెష్ లివర్ కావడం వల్ల కూర ఎంతో రుచిగా మరియు మెత్తగా వస్తుంది. నాన్‌వెజ్ ప్రియులకు ఈ లివర్ ముక్కలు ఎంతో ఇష్టమైన ఆహారం.

2 / 5
లివర్ కర్రీ పర్ఫెక్ట్‌గా రావడానికి ఆంటీ చెప్పిన ముఖ్యమైన చిట్కా... ముక్కల్లోని నీరంతా పోయి నూనె పైకి తేలాలి. ఇలా నూనెలో ముక్కలు బాగా వేగడం వల్ల లివర్ లోపలి వరకు ఉడికి, ఎలాంటి పచ్చి వాసన రాకుండా సాఫ్ట్‌గా మారుతుంది.  ముక్కకు మసాలా కూడా బాగా పడుతుంది

3 / 5
ఆ తర్వాత ఐదు స్పూన్ల కారం (ఎండాకాలాన్ని బట్టి కారం కొద్దిగా తగ్గించారు), ఇంట్లో పట్టుకున్న గరం మసాలా, మటన్ మసాలా, ధనియాల పొడి, కొబ్బరి పొడి మరియు కస్తూరి మేతి వేసి ముక్కలను బాగా ఫ్రై చేయాలి.

4 / 5
నూనె పైకి తేలి, మసాలాల ఘుమఘుమలు మొదలైనప్పుడు నోరూరించే కుమారి ఆంటీ స్పెషల్ మటన్ లివర్ ఫ్రై సిద్ధమవుతుంది. అయితే ఎండ తీవ్రతను బట్టి కారాన్ని సరిచేస్తూ, కస్టమర్ల ఆరోగ్యానికి తగ్గట్టుగా మసాలాల నిష్పత్తిని బ్యాలెన్స్ చేయడం కుమారి ఆంటీ ప్రత్యేకత.

5 / 5
Follow Us