Video: ఐపీఎల్ సీజన్ నుంచి CSK ఇంటికెళ్లడంతో.. ధోని చూడండి ఏం చేస్తున్నాడో!
ఐపీఎల్ 2026 ముగిసిన అనంతరం భారత మాజీ కెప్టెన్ ధోని తన స్వస్థలం రాంచీలో ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను నడుపుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత ధోనీ మళ్లీ తన వ్యక్తిగత జీవితంలోకి వచ్చారని అభిమానులు భావిస్తున్నారు.

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తర్వాత ధోనీ తన సొంత ఊరు రాంచీలో విలాసవంతమైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీని స్వయంగా నడుపుతూ కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ధోనీ సాధారణ దుస్తుల్లో, ఎలాంటి ఆర్భాటం లేకుండా రాంచీ వీధుల్లో డ్రైవ్ చేస్తూ కనిపించారు.
ధోనిని చూసిన అభిమానులు ఫొటోలు, వీడియోలు తీశారు. ఎప్పటిలాగే ప్రశాంతంగా కనిపించిన ధోనీ అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. క్రికెట్‌తో పాటు వాహనాలపై ధోనీకి ఉన్న ఆసక్తి గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వద్ద అరుదైన బైక్‌లు, లగ్జరీ కార్లు, వింటేజ్ వాహనాలతో కూడిన భారీ కలెక్షన్ ఉంది. ఇటీవల కనిపించిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కూడా ఆయన గ్యారేజ్‌లోని అత్యంత ప్రీమియం వాహనాల్లో ఒకటిగా భావిస్తున్నారు.
Thala Dhoni spotted cruising in his Land Rover Defender in Ranchi 🔥🔥 pic.twitter.com/ELIMf8FIjg
— DHONI Trends™ (@TrendsDhoni) May 22, 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో ధోని ఆడతాడని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. ధోని గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆయన ఒక్క మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగలేదు. అలాగే సీఎస్‌కే కూడా ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతో టోర్నీ నుంచి త్వరగానే బయటకు రావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ధోనీ మళ్లీ తన వ్యక్తిగత జీవితంలోకి, కుటుంబంతో గడిపే సమయానికి తిరిగి వచ్చినట్లు అభిమానులు భావిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
