AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొవ్వు ఫుల్లుగా ఉంటుంది.. చికెన్ లివర్, మటన్ లివర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?

చికెన్‌ లివర్‌, మటన్‌ లివర్‌ రెండింటిలోనూ ప్రోటీన్‌, ఐరన్‌, విటమిన్‌ బి12, విటమిన్‌ ఏ, జింక్‌, సెలీనియం వంటి కీలక పోషకాలు ఉంటాయి. ఐరన్‌, ఫోలేట్‌ అవసరమైన వారికి చికెన్‌ లివర్‌ ఉపయోగకరంగా ఉండొచ్చు. విటమిన్‌ బి12, జింక్‌, కాపర్‌ వంటి పోషకాలు ఎక్కువగా కావాలనుకునే వారికి మటన్‌ లివర్‌ మంచి ఎంపిక కావచ్చు. అయితే లివర్‌లో కొలెస్ట్రాల్‌, విటమిన్‌ ఏ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున అతిగా తీసుకోవడం మంచిది కాదు.

కొవ్వు ఫుల్లుగా ఉంటుంది.. చికెన్ లివర్, మటన్ లివర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
Chicken Liver Vs Mutton Liver
Shaik Madar Saheb
|

Updated on: Aug 15, 2026 | 12:10 PM

Share

వీకెండ్ వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులకు మటన్, చికెన్, ఫిష్ లాంటివి ఉండాల్సిందే.. చాలా మంది ఎక్కువగా మటన్, చికెన్ ను ఇష్టంగా తింటారు. అయితే.. చికెన్ కావొచ్చు.. మటన్ కావొచ్చు.. వీటిలో ప్రోటీన్‌తోపాటు ఎన్నో షకాలు దాగున్నాయి.. ముఖ్యంగా లివర్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. మేక కాలేయం (లివర్), కోడి లివర్ లో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి పలు సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.. మీకు తరచుగా విపరీతమైన అలసటగా అనిపిస్తుందా? జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు ఉందా? అయితే మీ ఆహారంలో లివర్ (కలేజ/కాలేయం) చేర్చుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చికెన్, మటన్ లివర్లు కేవలం రుచికరమైనవి మాత్రమే కాకుండా శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలను అందించే పవర్ హౌస్‌లుగా పనిచేస్తాయి. అయితే, ఆరోగ్యపరంగా ఈ రెండింటిలో ఏది శ్రేష్ఠమైనది? ఏది ఎవరికి ఉపయోగపడుతుంది? అనే వివరాలు తెలుసుకుందాం.

చికెన్ లివర్ – ఉపయోగాలు, పోషకాలు:

చికెన్ లివర్ తక్కువ ధరకు లభించడమే కాకుండా సులభంగా జీర్ణమయ్యే గుణం కలిగి ఉంటుంది.

అద్భుతమైన పోషకాలు: ఇందులో ఐరన్, సెలీనియం, విటమిన్ ఎ, విటమిన్ బి12, ఫోలేట్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

క్యాన్సర్ ముప్పు తగ్గింపు: చికెన్ లివర్‌లో ఉండే సెలీనియం అనే మూలకం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

రక్తహీనతకు నివారణ: ఇందులో ‘హీమ్ ఐరన్’ ఎక్కువగా ఉంటుంది. దీనిని శరీరం వేగంగా గ్రహిస్తుంది, కాబట్టి రక్తహీనత (ఎనీమియా)తో బాధపడేవారికి ఇది ఒక ఔషధంగా పనిచేస్తుంది.

ఇతర ఉపయోగాలు: కంటి చూపును, చర్మ ఆరోగ్యాన్ని, మెదడు పనితీరును, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడుతుంది. ఉడికించిన చికెన్ లివర్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండటంతో పాటు శరీరంలో కొవ్వు తగ్గుతుంది.

మటన్ లివర్ – ఉపయోగాలు, పోషకాలు:

మటన్ లివర్ చికెన్ లివర్ కంటే కాస్త గట్టిగా ఉన్నప్పటికీ పోషకాల విషయంలో చాలా ముందుంటుంది.

విటమిన్ బి12 ఖజానా: మటన్ లివర్‌లో విటమిన్ బి12 చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు జ్ఞాపకశక్తిని, నరాల బలాన్ని పెంచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది.

ఇతర విటమిన్లు – ఖనిజాలు: ఇందులో విటమిన్ ఎ, డి, బి12 లతో పాటు జింక్, కాపర్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి.

ఎముకలు, దంతాల ఆరోగ్యం: జింక్, కాపర్, సెలీనియం ఎముకలు, దంతాల బలానికి ఎంతో అవసరం. అలాగే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.

ఏది ఎప్పుడు ఎంచుకోవాలి?

ఇలాంటి వారికి చికెన్ లివర్ బెస్ట్ :

మీకు విపరీతమైన అలసట, రక్తహీనత ఉండి, సులభంగా జీర్ణమయ్యే ఐరన్, ప్రోటీన్, ఫోలేట్ కావాలనుకుంటే చికెన్ లివర్ ఉత్తమం.

మటన్ లివర్ బెస్ట్ ఛాయిస్:

మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తి పెంపు, నరాల బలం, జింక్, విటమిన్ బి12 అధికంగా కావాలనుకునే వారికి మటన్ లివర్ బెస్ట్ ఆప్షన్.

ముఖ్యమైన జాగ్రత్తలు:

కొలెస్ట్రాల్ బాధితులు: చికెన్, మటన్ లివర్ రెండింటిలోనూ కొలెస్ట్రాల్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. చికెన్ తో పోలిస్తే.. మటన్ లో ఎక్కువగా కొవ్వు శాతం ఉంటుంది.. అందువల్ల గుండె జబ్బులు ఉన్నవారు, హై కొలెస్ట్రాల్ తో బాధపడేవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే తినాలి. మూత్రపిండాల (కిడ్నీ) సమస్యలతో బాధపడేవారు లివర్ ఆధారిత వంటకాలకు వీలైనంత వరకు దూరంగా ఉండటమే మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us