రైల్వే స్టేషన్‌లో స్క్వాడ్ డ్రగ్ వెళ్తూ వెళ్తూ ఒకచోట ఆగింది.. మూటలు విప్పితే.. బయటపడ్డ అసలు రంగు!
విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలన కోసం నగర పోలీసులు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలు, రవాణా కేంద్రాలపై గట్టి నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నగర డాగ్ స్క్వాడ్ బృందాలు రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ కాంప్లెక్స్, బీచ్ రోడ్డు వంటి ప్రధాన ప్రాంతాలలో నిరంతరం పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలన కోసం నగర పోలీసులు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలు, రవాణా కేంద్రాలపై గట్టి నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నగర డాగ్ స్క్వాడ్ బృందాలు రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ కాంప్లెక్స్, బీచ్ రోడ్డు వంటి ప్రధాన ప్రాంతాలలో నిరంతరం పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే పెందుర్తి రైల్వే స్టేషన్‌లో ఒక ఆసక్తికరమైన, సంచలన ఘటన చోటుచేసుకుంది.
ఆ రోజు విశాఖ పెందుర్తి రైల్వే స్టేషన్ ఎప్పటిలాగే ప్రయాణికుల రాకపోకలతో ఎంతో బిజీబిజీగా ఉంది. సరిగ్గా అదే సమయంలో పోలీస్ ప్రత్యేక బృందం, డాగ్ హ్యాండ్లర్లు కలిసి అక్కడ తనిఖీలు చేపట్టారు. వారితో పాటు విశాఖ పోలీస్ శాఖకు చెందిన అత్యంత ప్రతిభావంతమైన నార్కోటిక్ డాగ్ ‘లక్కీ’ కూడా రంగంలోకి దిగింది. పదునైన వాసన పీల్చే శక్తి ఉన్న లక్కీ.. ఎంతో యాక్టివ్‌గా ఆ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తూ ముందుకు సాగింది. ప్రయాణికుల బ్యాగులు, మూటలను ఒక్కొక్కటిగా చెక్ చేసుకుంటూ వెళ్తున్న లక్కీ.. హఠాత్తుగా ఒకచోట ఆగిపోయింది.
అక్కడే ఉన్న కొన్ని బ్యాగుల వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ, కదలకుండా కూర్చుండిపోయింది. నార్కోటిక్ డాగ్స్ ఏదైనా అనుమానాస్పద వస్తువును గుర్తిస్తేనే అలా ప్రవర్తిస్తాయి. లక్కీ ఇచ్చిన ఆ సంకేతంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులకు, డాగ్ హ్యాండ్లర్లకు తీవ్ర అనుమానం వచ్చింది. ఆ మూటల్లో ఏదో నిషేధిత పదార్థం ఉందనే విషయం వారికి అర్థమైంది.
మూటలు విప్పితే.. అసలు రంగు బయటపడింది!
పోలీసులు వెంటనే లక్కీ సూచించిన ఆ స్థలానికి చేరుకుని, అక్కడ లావారసుగా ఉన్న ఒక సూట్ కేసు, నాలుగు పెద్ద బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులు చూస్తుండగానే ఆ మూటలను, సూట్ కేస్‌ను తెరిచి చూశారు. అందులో ప్లాస్టిక్ కవర్లతో ప్యాక్ చేసిన అనుమానాస్పద ప్యాకెట్లు కనిపించాయి. ఆ ప్యాకెట్లను క్షుణ్ణంగా పరిశీలించి ఓపెన్ చేయగా.. అసలు విషయం బయటపడింది. అందులో ఉన్నది మరేదో కాదు.. నిషేధిత మాదకద్రవ్యమైన గంజాయి!
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 50 కిలోల గంజాయిని నిందితులు ఆ బ్యాగుల్లో దాచి తరలించేందుకు ప్రయత్నించారు. లక్కీ సమయస్ఫూర్తి వల్ల ఈ భారీ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని, దానికి కారణమైన ఇద్దరు నిందితులను చాకచక్యంగా గుర్తించి అరెస్ట్ చేశారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం నిందితులను, స్వాధీనం చేసుకున్న గంజాయిని పెందుర్తి పోలీసులకు అప్పగించారు.
శభాష్ లక్కీ.. అందరి ప్రశంసలు!
రైల్వే స్టేషన్ వంటి రద్దీ ప్రదేశంలో అంత పెద్ద ఎత్తున తరలిస్తున్న గంజాయిని క్షణాల్లో పసిగట్టిన నార్కోటిక్ డాగ్ లక్కీపై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. ఉన్నతాధికారులు, తోటి సిబ్బంది లక్కీని ఆప్యాయంగా తట్టి అభినందించారు. అలాగే లక్కీని అంత చక్కగా గైడ్ చేసిన డాగ్ హ్యాండ్లర్‌ను కూడా ప్రత్యేకంగా అభినందించారు. లక్కీ ఇలా గంజాయిని పట్టుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలు కీలకమైన ఆపరేషన్లలో పాల్గొని, నిందితులు ఎంతో రహస్యంగా దాచిన గంజాయి నిల్వలను తన పదునైన ముక్కుతో పసిగట్టి పోలీసులకు అప్పగించింది.
విశాఖను డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్లో లక్కీ లాంటి నార్కోటిక్ డాగ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ తాజా ఘటనతో పోలీస్ శాఖ అంతా ఒకే మాట అంటోంది.. “శభాష్ లక్కీ.. కీప్ ఇట్ అప్!”
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
