- Telugu News Photo Gallery Korean Hair Care Tips: Some Korean Hair Care Ideas And Try To Get Strong And Long Hair, Check Out here
Korean Hair Care: మీకూ కొరియన్ స్టైల్ హెయిర్ కావాలా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
అద్దం ముందు కూర్చుని అందంగా అలంకరించుకోవడం మగువలకు మహా ఇష్టం. అందుకు రోజూ రకరకాల మేకప్ ట్రిక్స్ ఫాలో అవుతుంటారు. అయితే జుట్టు విషయంలో కొందరు నిరాశకు గురవుతుంటారు. ఎందుకంటే అదుపు లేకుండా ఊడిపోయే జుట్టు వారిని వేదనకు గురి చేస్తుంది. అలాంటి వారి కోసం ఇక్కడ కొన్ని కొరియన్ బ్యూటీ చిట్కాలు సూచిస్తున్నారు నిపుణులు. ఈ బ్యూటీ టిప్స్ చర్మానికే కాదు జుట్టు సంరక్షణకు కూడా చాలా ఉపయోగపడతాయి..
Updated on: Feb 02, 2024 | 12:12 PM

అద్దం ముందు కూర్చుని అందంగా అలంకరించుకోవడం మగువలకు మహా ఇష్టం. అందుకు రోజూ రకరకాల మేకప్ ట్రిక్స్ ఫాలో అవుతుంటారు. అయితే జుట్టు విషయంలో కొందరు నిరాశకు గురవుతుంటారు. ఎందుకంటే అదుపు లేకుండా ఊడిపోయే జుట్టు వారిని వేదనకు గురి చేస్తుంది. అలాంటి వారి కోసం ఇక్కడ కొన్ని కొరియన్ బ్యూటీ చిట్కాలు సూచిస్తున్నారు నిపుణులు. ఈ బ్యూటీ టిప్స్ చర్మానికే కాదు జుట్టు సంరక్షణకు కూడా చాలా ఉపయోగపడతాయి.

ఈ కొరియన్ పద్ధతి జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, దాని వాల్యూమ్‌ను పెంచడానికి సహాయపడుతుంది. కొరియన్ స్టైలో జుట్టును ఎలా సంరక్షించుకోవాలో ఇక్కడ పరిశీలిద్దాం.. ముందుగా, జుట్టు రకం ఆధారంగా షాంపూని ఎంచుకోవాలి. వారంలో రెండు మూడు రోజులు షాంపూతో తలస్నానం చేయాలి.

కేవలం షాంపూ చేయడం వల్ల ఫలితం ఉండదు. స్కాల్ప్ మసాజ్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే కొరియన్ బ్యూటీలో మసాజ్ చాలా ముఖ్యం. కాబట్టి షాంపూ రాసుకుని చేతులతో తేలికగా మసాజ్ చేసుకోవాలి. ఇది తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా జుట్టు మూలాలు బలంగా మారతాయి. జుట్టు రాలడం ఆగిపోతుంది.

అలాగే హెయిర్ మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలి. మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన హెయిర్ మాస్క్‌కు బదులుగా ఇంట్లోనే హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకుంటే బెటర్. షాంపూ తర్వాత హెయిర్ సీరమ్ అప్లై చేయాలి. ఇది జుట్టును తేమగా ఉంచుతుంది.

జుట్టు చిట్లడం కూడా తగ్గిపోతుంది. కనీసం వారానికి ఒకసారి జుట్టును బియ్యం నానబెట్టిన నీటితో కడగాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి.




