- Telugu News Photo Gallery Know these are the side effects of eating heavy mangoes that go hand with their sweetness
Side Effects Of Mangoes: మామిడి పండ్లను ఎక్కువగా తినేస్తున్నారా ?.. అయితే మీ ఆర్యోగానికి డేంజరే.. ఎందుకంటే..
మామిడి పండ్లను ఇష్టపడనివారుండరు. వేసవిలో చిన్నా, పెద్ద తేడా లేకుండా ఈ పండ్లను తెగ లాగించేస్తుంటారు. అయితే మామిడి పండ్లు ఆరోగ్యానికి మేలు చేసినా.. అతిగా తింటే మొదటికే మోసం వస్తుందంటున్నారు నిపుణులు.
Updated on: Apr 21, 2022 | 7:11 PM

మామిడి పండ్లను ఇష్టపడనివారుండరు. వేసవిలో చిన్నా, పెద్ద తేడా లేకుండా ఈ పండ్లను తెగ లాగించేస్తుంటారు. అయితే మామిడి పండ్లు ఆరోగ్యానికి మేలు చేసినా.. అతిగా తింటే మొదటికే మోసం వస్తుందంటున్నారు నిపుణులు.

మామిడి పండ్లను అధికంగా తినడం వలన ఆరోగ్యానికి హానికరం. తియ్యగా ఉన్నాయని ఎక్కువగా తినేస్తే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే. ఎందుకో తెలుసుకుందామా. x

ఇందులో పొటాషియం, సోడియం సమృద్ధిగా ఉండడం వలన అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే గుండె సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉంచుంది.కానీ.. తీవ్రమైన దుష్రభావాలను కూడా కలిగి ఉంది.

మామిడి పండు తింటే చాలా మందికి అలెర్జీ వచ్చేస్తుంది. అలెర్జీకి కారణమయ్యే వాటిలో మామిడి ప్రోటీన్ ఒకటి. అలర్జీ ఉన్నవారు.. మామిడి పండ్లను ఎక్కువగా తినకూడదు.

మామిడి పండ్లను తినడం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. తీపి, జ్యూసీ మామిడి సహజ్ గ్లూకోజ్ ను కలిగి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం సహజ గ్లూకోజ్ కారణంగా మధుమేహం , ఇతర వ్యాధులతో బాధపడేవారు.. మామిడి పండ్లను రెగ్యులర్ గా తినలేరు.

వివిధ రకాల్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది.. మామిడి గింజలు, తొక్కలలో అదిక మొత్తంలో పైబర్ ఉంటంది. మామిడి పండు జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది.

ఒకేసారి ఎక్కువ మామిడి పండ్లను తినడం వలన వేగంగా బరువు పెరుగుతారు. ఇతర ఆహార పదార్థఆలతో పోలిస్తే మామిడిలో పీచు పదార్థాు తక్కువగా ఉండడం.. సహజసిద్ధమైన చక్కెరలు, కేలరీలు అధికంగా ఉంటాయి. దీంతో ఇవి తింటే బరువు పెరుగుతారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం మామిడి పండ్లను ఎక్కువగా తినడం వలన జీఐ సమస్యలు వస్తాయి. ఇది పులియబెట్టే కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. ఇది ఐబీఎస్ ప్రకోప ప్రేగు సిండ్రోమ్ కు దారితీస్తుంది.




