Soyabean Side Effects: సోయాబీన్ మంచిదని తెగ తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..
Soyabean Health Effects: సోయాబీన్‌లో ప్రొటీన్, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే సోయాబీన్స్ తింటే మంచిదని సూచిస్తారు. అయితే.. పరిమిత పరిమాణంలో తీసుకుంటే మాత్రమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Updated on: Feb 26, 2022 | 10:52 AM

సోయాబీన్‌ను పరిమిత పరిమాణంలో తీసుకుంటే మాత్రమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ సోయాబీన్‌ను ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యానికి కలిగే హాని గురించి ఇప్పడు తెలుసుకుందాం..

గుండె జబ్బులు: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సోయాబీన్‌లో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోకి అధికంగా వెళితే.. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇలాంటి పరిస్థితిలో సోయాబీన్‌ను పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిది.

ఊబకాయం: మీరు సోయాబీన్‌తో చేసిన ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే.. స్థూలకాయం బారిన పడేలా చేస్తుంది. దీనితో చేసిన వస్తువులు చాలా రుచిగా ఉన్నప్పటికీ, పరిమిత పరిమాణంలో తినాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గర్భిణీలు: గర్భిణులు సోయాబీన్స్ తినాలని వైద్యులు సలహా ఇస్తారు. కానీ కొన్నిసార్లు ఇది గర్భిణీలకు వాంతులు కలిగించవచ్చు. ఇలాంటి సందర్భంలో సోయాబీన్స్ ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం మంచిది.

మధుమేహం: సోయాబీన్‌ను ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఒక్కోసారి మీరు దీనివల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులుగా కూడా మారవచ్చు.

అలర్జీలు: కొన్నిసార్లు సోయాబీన్స్ అలర్జీకి కూడా కారణం కావచ్చు. సోయాబీన్స్ తిన్న తర్వాత చర్మంపై దద్దుర్లు, మంట, నొప్పిగా అనిపిస్తే ఈ రోజు నుంచే సోయాబీన్స్ తీసుకోవడం మానేయడం మంచిది.




