- Telugu News Photo Gallery Know about most powerful earthquakes ever to occur in the world as 8.8 magnitude quake hits Russia
Biggest Earthquakes: ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపాలు ఇవే!
రష్యాలో ఏర్పడిన అత్యంత శక్తి వంతమైన భూకంపం అతలాకుతలం చేసేసింది. కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్‌స్క్ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.7గా నమోదైంది. రష్యాలోనే కాదు ప్రంపంలోనే ఇంత శక్తవంతమైన భూకంపం సంభవించడం గడిచిన 24 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ భూంకంపం ఒక్క రాష్యాకే కాకుండా దాదాపు 30 దేశాలను కుదిపేసింది. అయితే ఇప్పటి వరకు ఈ స్థాయిలో ప్రపంచాన్ని కుదిపేసిన భూకంపాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Updated on: Jul 30, 2025 | 3:10 PM

ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించిన భూకంపాల్లో అత్యంత శక్తివంతమైనది గ్రేట్ చిలీ భూకంపం. ఇది 1960లో దక్షిణ అమెరికా దేశమైన చిలీలో ఏర్పడింది. అప్పుడు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్ర 9.5గా నమోదైంది. ఈ భూకంపం ప్రంచాన్ని అతలాకుతలం చేసేసింది. దీని ప్రభావంతో 1,655 ప్రాణాలు కోల్పోగా, లక్షల మంది నిరాశ్రయులయ్యారు. లక్షల కొద్ది భవనాలు నేలమట్టమయ్యాయి.

గ్రేట్‌చిలీ భూకంపం తర్వాత సంభవించిన మరో అతిపెద్ద భూకంపం గుడ్‌ఫ్రైడే భూకంపం. ఇది 1964లో అమెరికా రాష్ట్రమైన అలస్కాలో ఏర్పడింది. అప్పుడు రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 9.2గా నమోదైంది. ఈ భూప్రకంపనల ధాటికి ఏర్పడిన సునామీ అలస్కా నగరాన్ని ముంచెత్తింది. ఈ భూంకం ధాటికి సుమారు 130 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

గుడ్‌ఫ్రైడే భూకంపం తర్వాత సంభవించిన మరో పెద్ద భూకంపం 2004లో ఇండొనేషియాలోని సుమత్రా దీవుల్లోసంభవించింది. అప్పుడు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 9.1 నమోదైంది. ఈ భూకంపం సుమారు మూడు దేశాలను కుదిపేసింది. ఈ భూకంపం ధాటికి మూడు దేశాల వ్యాప్తంగా సుమారు 2,80,000 మందికిపైగా జనాలు ప్రాణాలు కోల్పోయారు.

2004 తర్వాత 2011లో జపాన్‌లో సంభవించిన గ్రేట్ తోహోక్ అనే మరో భారీ భూకంపం ప్రపంచాన్ని వణికించింది. అప్పుడు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 9.1గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి సుమారు 15 వేల మంది దాకా జనాలు ప్రాణాలు కోల్పోయారు.

ఇక ప్రపంచంలోనే తొలిసారి రష్యాలో అత్యంత శక్తవంతమైన భూకంపం సంభవించింది. ఇది 1952లో కమ్చట్కా క్రై ప్రాంతంలో ఏర్పడింది. అప్పుడు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్ర 9గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి ఎలాంటి భారీగా అస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది.




