Kitchen Hacks: నీళ్లలో దీనిని కలిపి తోమారంటే.. మీ వంట గది సామాన్లు తళ తళ మెరిసిపోతాయ్..
వంటగదిలో పాత్రలు కడగడం ప్రతి ఇళ్లాలికి తప్పని పని. ఒక్కోసారి వంట చేసేసమయంలో పాత్రలు మాడిపోతాయి. వాటిని శుభ్రం చేయడం అంతతేలికకాదు. జిడ్డు, మురికి అంత త్వరగా వదిలిపోదు. ఫలితంగా దుర్వాసన వస్తూ ఉంటాయి. సాధారణంగా సబ్బు లేదా లిక్విడ్‌ను పాత్రలు కడగడానికి ఉపయోగిస్తారు. దీనితో తోమడం వల్ల మొండి మరకలు వదిలిపోవు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే..
Updated on: Oct 11, 2023 | 9:11 PM

వంటగదిలో పాత్రలు కడగడం ప్రతి ఇళ్లాలికి తప్పని పని. ఒక్కోసారి వంట చేసేసమయంలో పాత్రలు మాడిపోతాయి. వాటిని శుభ్రం చేయడం అంతతేలికకాదు. జిడ్డు, మురికి అంత త్వరగా వదిలిపోదు. ఫలితంగా దుర్వాసన వస్తూ ఉంటాయి. సాధారణంగా సబ్బు లేదా లిక్విడ్‌ను పాత్రలు కడగడానికి ఉపయోగిస్తారు. దీనితో తోమడం వల్ల మొండి మరకలు వదిలిపోవు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే..

సామాన్లు కడగడానికి కాఫీ పొడిని వినియోగించవచ్చు. ఒక చెంచా కాఫీ పొడిని నీటిలో కలిపి బాగా మరిగించాలి. దీనిలో మురికిగా ఉన్న సామాన్లను 15-20 నిమిషాలు అందులో నానబెట్టండి. ఆ తర్వాత నీళ్లతో కడిగితే సరి. మరకలు ఇట్లే వదిలిపోతాయి.

బంగాళాదుంపలను కట్ చేసి ఒక గిన్నెలో ఉంచండి. 15 నిమిషాల తర్వాత బంగాళదుంప ముక్కలతో డిష్‌ను రుద్ది, శుభ్రమైన నీటితో కడగడం వల్ల దుర్వాసన తొలగిపోతుంది.

గిన్నెలపై మొండి మరకలను తొలగించడానికి బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో 5 టేబుల్ స్పూన్ల వెనిగర్ కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో నిమ్మకాయ రసం కలుపుకోవాలి.ఈ మిశ్రమంతో గిన్నెలు కడిగితే వాసన, మరకలు పోతాయి.

వండేటప్పుడు ఆహారం పాన్‌కి అంటుకుని నల్లగా మారితే వేడి నీళ్లలో బేకింగ్ సోడా కలిపి అరగంట పాటు పాత్రలు అందులో నానబెట్టాలి. ఆ తర్వాత సబ్బుతో పాత్రలను కడిగితే తళ తళ మెరుస్తాయి.