Kitchen Hacks: ఇలా చేశారంటే గ్యాస్‌ స్టవ్‌ మురికి వదిలి తళతళలాడిపోతాయ్‌..

వంటగదిలో వినియోగించే గ్యాస్ ఓవెన్లు, సిలిండర్లకు అంటుకున్న మురికి వదిలించడం అంత సులువుకాదు. రోజువారీ వంటల కారణంగా గ్యాస్ స్టవ్‌లు అపరిశుభ్రంగా మారుతాయి. నూనె, మసాలా దినుసులు, పొంగిన పాలు తాలూకు మరకల వల్ల గ్యాస్ స్టవ్ మురికిగా తయారవుతుంది. దీనిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే రోజు రోజుకు మురికి పేరుకుపోతుంది. దీంతో వాటి అసలు రూపం మారిపోతుంది. అయితే ఈ కింది చిట్కాలు పాటించడం..

Srilakshmi C

|

Updated on: Nov 29, 2023 | 12:04 PM

వంటగదిలో వినియోగించే గ్యాస్ ఓవెన్లు, సిలిండర్లకు అంటుకున్న మురికి వదిలించడం అంత సులువుకాదు. రోజువారీ వంటల కారణంగా గ్యాస్ స్టవ్‌లు అపరిశుభ్రంగా మారుతాయి. నూనె, మసాలా దినుసులు, పొంగిన పాలు తాలూకు మరకల వల్ల గ్యాస్ స్టవ్ మురికిగా తయారవుతుంది.

1 / 5
దీనిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే రోజు రోజుకు మురికి పేరుకుపోతుంది. దీంతో వాటి అసలు రూపం మారిపోతుంది. అయితే ఈ కింది చిట్కాలు పాటించడం వల్ల మీ గ్యాస్‌ స్టవ్‌ కొత్త దానిలా మెరిసిపోతుంది.

2 / 5
స్టవ్‌లను శుభ్రం చేయడానికి అమ్మోనియా బాగా ఉపయోగపడుతుంది. ఇది హార్డ్‌వేర్ స్టోర్‌లలో లభిస్తుంది. నీళ్లలో అమ్మోనియాను కలిపి.. ఆ నీళ్లలో ఓవెన్ రాక్‌ను రాత్రంతా నానబెట్టుకోవాలి. తెల్లవారాక చూస్తే మెరిసిపోతూ కనిపిస్తాయి. మరిగే నీటిలో కొద్దిగా డిష్‌వాషర్ లేదా సబ్బు వేయాలి. ఆ నీటితో పొయ్యిని శుభ్రం చేసినా జిడ్డు ఇట్టే వదిలిపోతుంది.

3 / 5
కొద్దిగా నీళ్లు పోసి సమాన పరిమాణంలో ఉప్పు, బేకింగ్ సోడా కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. చేయండి. ఆ పేస్ట్‌ను ఓవెన్‌కు అప్లై చేసి కాసేపు అలాగే ఉంచండి. ఆ తర్వాత స్క్రబ్బర్‌తో స్క్రబ్ చేసుకుంటే సరి. ప్రతి ఇంట్లో వెనిగర్ ఉంటుంది. ఒక భాగం వెనిగర్‌కు రెండు భాగాల నీటితో కలిపి.. ఆ మిశ్రమాన్ని ఓవెన్‌కు అప్లై చేసుకోవాలి. కొంతసేపటి తర్వాత బ్రష్‌తో రుద్దితే తళతళ మెరుస్తుంది.

4 / 5
గ్యాస్‌ స్టవ్‌లను నిమ్మరసంతో కూడా శుభ్రం చేయవచ్చు. ఓవెన్, బర్నర్‌లకు నిమ్మరసం అప్లై చేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే సరి.

5 / 5
Follow us