- Telugu News Photo Gallery Kishmish Health Benefits: From treating Anaemia to blood pressure: 5 benefits of raisins
Health Care: తరచూ అలసటగా, తల తిరుగుతున్నట్లు అనిపిస్తుందా? వీటిని రోజుకు 4-5 పలుకులు తిన్నారంటే..
ఒక్కోసారి బలహీనంగా అనిపంచడంతోపాటు తల తిరిగినట్లు అనిపిస్తుంటుంది. పైగా రక్తపోటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమస్యలన్నింటికీ డ్రై ఫ్రూట్స్‌తో చెక్ పెట్టొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఎండుద్రాక్షలు తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందడమే కాకుండా రోజంగా ఉత్సాహంగా ఉంటారు. ఎండు ద్రాక్షలో ఐరన్, పొటాషియం, ఫైబర్, విటమిన్-సి, బి6 వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి..
Updated on: May 28, 2024 | 8:54 PM

ఒక్కోసారి బలహీనంగా అనిపంచడంతోపాటు తల తిరిగినట్లు అనిపిస్తుంటుంది. పైగా రక్తపోటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమస్యలన్నింటికీ డ్రై ఫ్రూట్స్‌తో చెక్ పెట్టొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఎండుద్రాక్షలు తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందడమే కాకుండా రోజంగా ఉత్సాహంగా ఉంటారు.

ఎండు ద్రాక్షలో ఐరన్, పొటాషియం, ఫైబర్, విటమిన్-సి, బి6 వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే పిల్లల నుండి వృద్ధుల వరకు ఎండు ద్రాక్ష ప్రతి ఒక్కరికీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ఎండుద్రాక్షలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతిరోజూ ఎండుద్రాక్ష తినాలి. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాబట్టి మలబద్ధకం సమస్య ఉంటే ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన ఎండుద్రాక్షను తిని, ఆ నీటిని తాగేయాలి.

ఎండు ద్రాక్ష తినడం వల్ల బలహీనత, తల తిరగడం మాత్రమే కాకుండా అనేక ఇతర వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. ఎండుద్రాక్ష హిమోగ్లోబిన్ తయారీలో సహాయపడుతుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు ప్రతిరోజూ కనీసం 4-5 ఎండు ద్రాక్షలను తినాలి.

ఎండుద్రాక్షను ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఆ నానబెట్టిన ఎండుద్రాక్షను తినడంతోపాటు.. ఎండుద్రాక్ష నానబెట్టిన నీటిని తాగడం ద్వారా కూడా మరిన్ని ప్రయోజనాలను పొందుతారు. రోజూ 4-10 ఎండు ద్రాక్షలు తినాలి. అయితే ఎండుద్రాక్షలో చక్కెరలు ఉంటాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎండుద్రాక్ష తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.





























